Home జాతీయ వార్తలు అద్వానీతో మమత భేటీ

అద్వానీతో మమత భేటీ

Delhi : West Bengal CM Mamata Banerjee Meets LK Advani

ఢిల్లీ : పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీతో భేటీ అయ్యారు. వీరు పలు అంశాలపై చర్చించారు. అస్సాం ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన పౌరుల ముసాయిదా జాబితాపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ జాబితాపై మమత మండిపడుతున్న విషయం తెలిసిందే. అస్సాంలో పౌరుల జాబితాలో నలబై లక్షల మంది పేర్లను తొలగించడంతో అస్సాం, ప్రధాని మోడీపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం రాజ్యసభలో ఎన్‌ఆర్‌సి వ్యవహారంపై పెద్ద రగడ జరిగింది. దీంతో సభను గురువారం నాటికి వాయిదా వేశారు.

West Bengal CM Mamata Banerjee Meets LK Advani