Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆకుపచ్చ రంగు బుట్టలో తడి చెత్త, నీలిరంగు బుట్టలో పొడి చెత్త వేయాలి: సిఎం కెసిఆర్

kcr4హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. డ్రైవర్ కమ్ ఓనర్ పద్దతిలో తొలిదశలో 1005 ఆటో ట్రాలీల పంపిణీ చేయనున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రెండు చెత్తబుట్టల పంపిణీ చేయనున్నారు. 42 లక్షల చెత్తబుట్టలు మహానగరంలో పంపిణీ చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ దిశగా మరో ముందడుగు వేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్, మంత్రులు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఓ మంచి కార్యక్రమానికి  ఈ రోజు అడుగుపడిందని సిఎం కెసిఆర్ తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు సమైక్య రాష్ట్రంలో కష్టాలు, నష్టాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా తాగునీటి జలాశయం లేదన్నారు. వానపడితే హైదరాబాద్‌లో కార్లు బోట్లు అవుతాయన్నారు. హైదరాబాద్‌కు రెండు తాగునీటి జలాశయాల కోసం స్థలాలు ఎంపిక చేశామన్నారు. కనీసం 30 టిఎంసిల నీటి సామర్థం ఉన్న రెండు జలాశయాలు నిర్మిస్తామన్నారు. రామోజీ పిలింసిటీ వద్ద 15 టిఎంసిల జలాశయం నిర్మిస్తామన్నారు. కేశవాపురం వద్ద మరో 15 టిఎంసిల జలాశయం నిర్మిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఎంఎల్‌ఎ, ఎంపిలతో సమావేశం అయ్యామని ఆయన తెలిపారు. చెత్త సేకరణపై అవగహన కల్పించేందుకు నెలకుపైగా సమయం పడుతుందని తెలిపారు. ఆకుపచ్చ రంగు బుట్టలో తడి చెత్త, నీలిరంగు బుట్టలో పొడి చెత్త వేయాలన్నారు. పట్టుబడితే సాధించలేనిదంటూ ఉండదన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ మేటి నగరం అవుతుందన్నారు. భవనాలు, లే అవుట్ల కోసం క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Comments

comments