Home రాష్ట్ర వార్తలు హామీల అమలెప్పుడు?

హామీల అమలెప్పుడు?

బడ్జెట్ కాగితాలకే పరిమితం
ప్రజా పోరు సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటర్వూ
నేడు కొల్లాపూర్‌లో తొలి ప్రజా పోరు బహిరంగసభ

revanth-reddyహైదరాబాద్ : ఇప్పటి వరకు మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా మాయ మా టలతోనే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయతిస్తుందని, బడ్జెట్ కాగితాలకు, మాటలు ప్రజలకు పరిమితమైపోతున్నాయని టి డిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభు త్వ వైఫల్యాలను నిలదీసేందుకే మంత్రుల నియోజకవర్గాల్లో ప్రజా పోరు పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, శనివారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌తో ఈ సభలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మొదటి ప్రజాపోరు బ హిరంగ సభ నేపథ్యంలో రేవంత్‌రెడ్డితో “మన తెలంగాణ ”ఇంటర్వూ.
ప్రశ్న: మంత్రుల నియోజవర్గాల్లోనే ప్రజా పోరు సభలు ఎందుకు?
రేవంత్: టిఆర్‌ఎస్ సర్కార్ ఇప్పటికి మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టింది. వాటిల్లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. ఇది మంత్రుల వైఫ్యలం. అందుకే మంత్రుల నియో జకవర్గాల్లో ప్రజాపోరు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. త్వరలో నాలుగవ బడ్జెట్ ప్రవేశపెట్ట బో తున్నారు. ఈ సారైనా ఎన్నికల హామీల అమలుకు అనుగు ణంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి.
ప్రశ్న: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టిడిపి ఒంటరిగానే ఉద్యమిస్తుందా? ఇతర పక్షాలతో కలుస్తారా?
రేవంత్: ప్రజాపోరు టిడిపి మాత్రమే నిర్వహిస్తున్నది. యురే నియం తవ్వకాలపై వామపక్షాలతో కలసి పోరాటం చేశాం. ఎవరైనా కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తే ఆహ్వానిస్తాం.
ప్రశ్న: కేంద్రంలో మీ పార్టీ అధికారం పంచుకుంది. ఎపిలో కూడా టిడిపి, బిజెపిలు కలసి పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా వారితో కలసి వెళ్తారా ?
రేవంత్: రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. బిజెపి ఇక్కడ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నది. రాష్ట్ర నాయకులకు ప్రభుత్వంలో ఎప్పుడు చేరాలా అని ఆతృతగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే తీరు కనబర్చింది. అయితే బిజెపి అధినాయకత్వమేమో మరోలా వ్యవహరి స్తోంది. 2019 రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి అధ్యక్షులు అమిత్ షా చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌తో సత్సంబ ంధం కొనసాగించేలా రాష్ట్ర నేతలు వ్యవహరిస్తున్నారు.
ప్రశ్న: టిడిపి తరపున ఏం చేసినా మీరే ఫోకస్ అవుతున్నారు. పార్టీలో కో ఆర్డినేషన్ లేదని అధ్యక్షుడు ఎల్. రమణతో విభేదాలు ఉన్నాయంటున్నారు.. ఇది దేనికి సంకేతం ?
రేవంత్: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ప్రతిపక్ష పార్టీ నేతగా అనేక విధాలుగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తుంటాను. సహజంగానే నాపై ఫోకస్ ఉంటుంది. రమణతో భిన్నాభిప్రా యాలు ఉండవచ్చేమో గాని విభేదాలు లేవు. అందులో భాగం గానే టిడిపిపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు.
ప్రశ్న : టిఆర్‌ఎస్‌తో పొత్తు వార్తలు వస్తున్నాయి… మళ్లీ అదే ప్రభుత్వంపై మీరు ప్రజాపోరు బాట నిర్వహిస్తున్నారు ?
రేవంత్ : టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు వార్తలు అవాస్తవం. మా పోరాటాలకు భయపడే ప్రభుత్వం ఇలా ప్రచారం చేయి స్తోంది. ఇలానే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పబ్బం గడపాలనుకుంటున్నారు. కెసిఆర్ శివలింగంపై తేలు లా ప్రవరిస్తున్నారు. చివరకు చట్టసభలైన అసెంబ్లీలో కూడా మభ్యపెట్టే మాటలే చెబుతున్నారు.
ప్రశ్న: వచ్చే బడ్జెట్‌లో కుల వృత్తులకు,సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయబోతున్నామని ప్రభుత్వం చెబుతుంది కదా ?
రేవంత్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మాయ మాటలతో ప్రజల ను మోసం చేయాలని చూస్తున్నారు. రెండున్నరేళ్లు సంపాదన మీదనే దృష్టి పెట్టారు. ఇది ఇప్పుడిపుడే ప్రజలకు అర్థమౌతోం ది. మిగిలిన రెండున్నరేళ్లు సంక్షేమం అంటూ ఊదరగొట్టి మ భ్య పెట్టాలని చూస్తున్నారు. టిఆర్‌ఎస్ కేవలం మాటలు, కాగి తాల ప్రభుత్వం.