Home తాజా వార్తలు మూడేళ్లలో రైతులకు ఏం చేశారు..? : జగ్గారెడ్డి

మూడేళ్లలో రైతులకు ఏం చేశారు..? : జగ్గారెడ్డి

Jagga-Reddy

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఓట్ల కోసమే రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడేళ్లలో కెసిఆర్ రైతుల కోసం ఏమి చేశారని.. ఇప్పుడు రైతే రాజు అంటున్నారని ప్రశ్నించారు. మిర్చి రైతులు పంటలను కాల్చుకుంటుంటే కెసిఆర్ కు కనబడటం లేదా అని అన్నారు. ఓ పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కెసిఆర్ ప్లీనరీ పేరుతో పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు.