Home జాతీయ వార్తలు భారతీయ మహిళకు ఎన్నాళ్లీ బాధలు?

భారతీయ మహిళకు ఎన్నాళ్లీ బాధలు?

ఎల్లకాలం ముళ్ల దారేనా?

ప్రేమ వేధింపులపై సుప్రీంకోర్టు ఆవేదనాపూరిత ప్రశ్నలు

Eveteasing

న్యూఢిల్లీ: ‘ఈ దేశంలో మహిళ ప్రశాంతంగా ఎందుకు జీవించలేకపోతోంది? ఆమె బతుకం తా అశాంతి.. జీవనపథమంతా గాయాలేనా?’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దేశం లో పలు చోట్ల స్త్రీలపై అఘాయిత్యాలు, హింస లు, వేధింపులు పెరిగిపోతుండటంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో పలు స్థాయిల్లో మహిళలను వెంటాడి అనేక రకాలుగా వేధించి చివరికి వారిని మానసిక అశాంతికి గురి చేస్తున్నార ని, ఈ దీనదశ ఇంకెంత కాలం? అని న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. 16 ఏళ్ల బాలిక బలవన్మరణం కేసులో దోషిగా ఖరార యిన ఓ వ్యక్తి చేసుకున్న అప్పీల్ విచారణ తరు వాత తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం దేశం లో మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని స్పందించింది.

ఓ వ్యక్తి 16 ఏళ్ల బాలిక వెంటబడి అనేక రకాలుగా వేధించడంతో చివరికి ఆ బాలిక వేరే మార్గం లేక ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ కేసుకు సంబంధించి ఆ వ్యక్తిని దోషిగా ఖరారు చేసిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని ఆ దోషి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కేసు విచా రణ సందర్భంగా  ధర్మాసనం స్త్రీల స్వేచ్ఛ, వారి జీవన హక్కు, వారి ఇష్టాయిష్టాలు వంటి కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రత్యేకించి యుక్తవయస్సుకు వచ్చిన మహిళల వెంటబడి ప్రేమించాలని వేధించే వైఖరి శృతి మించుతోందని, మహిళకు తమకంటూ సొంతమైన వ్యక్తిత్వం , అభిరుచి ఉంటుందనే కనీస అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సాగుతోన్న వేధింపులు, ఫ్యాషన్‌గా పిలువబడే టీజింగ్ తంతు దారుణంగా మారుతోందని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు ఎఎం ఖాన్‌విల్కర్, ఎంఎం శంతన్‌గౌడర్‌తో కూడిన ఈ ధర్మాసనం ఇప్పుడు బాలికల పాలిట జీవన్మరణ సమస్యగా మారిన ప్రేమ పేరిట సాగుతోన్న వేధింపులపై ఘాటుగా స్పందించింది.

‘ఎవరిని అభిమానించాలి. ఎవరిని ప్రేమించాలనేది మహిళ వ్యక్తిగత అంశం. ఈ స్వేచ్ఛ కీలకమైనది. ప్రేమించాలనే వేధింపులు అనాగరికం. ఆమె …ఆమె కాదనుకునే వ్యక్తిని కూడా ప్రేమించాలని బలవంతం చేయడం తగదు. మహిళల ప్రేమ వారి ఆంతరంగిక అంశం. ఈ ప్రేమ భావనను మగ వాడు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. వాదోపవాదాల సందర్భంగా దోషి తరఫు న్యాయవాది బాలిక మరణవాంగ్మూలంపై సందేహాలు వ్యక్తం చేశారు. వైద్య నివేదిక ప్రకారం ఆసుపత్రికి చేరిన దశలో ఆమె మాట్లాడే, రాసే దశలో లేదని పేర్కొని ఉందని తెలిపారు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న వ్యక్తి మరణవాంగ్మూలం ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. 2008 జులైలో ఈ బాలిక ఆ మగవాడి వేధింపులకు బలి అయింది. తరచూ వెంటబడి ఆమెను వేధిస్తూ ఉండటంతో ఒంటికి నిప్పంటించుకుని బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దశలో ఆమె ఇచ్చిన మరణవాంగ్మూలం లో తన బలవన్మరణానికి సదరు వ్యక్తి వేధింపులే కారణమని స్పష్టంగా పేరు వెల్లడించింది. సమాజం ఎంతగా పురోగమిస్తుందని అనుకుంటు న్నా వెంటబడి తరిమే రీతిలో సాగే తంతు ఆటవికంగా మారుతోందని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. త్వరలోనే తీర్పు వెలువరించనుంది.