Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భూ నిర్వాసితుల భవితవ్యం ఏమిటో?

Singareni

మంథని: భూసేకరణ సమస్య లకు సంబం ధించిన అంశాలపై హైదరాబాద్‌లో సింగరేణి ఉన్నతాధికారులు, జెసిలతో భూసేకరణ కమిషనర్‌తో ప్రత్యేకంగా నిర్వహించనున్న సమా వేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం లోనైనా తమ పదేళ్ల సమస్యకు, పోరాటానికి శుభం కార్డు పడుతుందేమోనని పెద్దంపేట, మం గళ్‌పల్లె సింగరేణి భూ నిర్వాసితులు ఆశగా ఎదు రు చూస్తున్నారు.

గతంలోనే పరిహారం చెల్లిం చాలంటూ భూనిర్వాసితులు ధర్నాలు, నిరసనలు చేట్టిన విషయం విధితమే. అయితే నేడు హైదరాబాద్‌లో జరగ నున్న సింగరేణి ఉన్నతా ధికారులు, జెసిల తో భూసేకరణ కమిషనర్ ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ, సింగరేణి భూసేకరణ అంశాలపై ప్రత్యేకంగా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని నిర్వాసితులు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే!

రామగిరి మండలం జల్లిపల్లి రెవన్యూ గ్రామంలో ముల్కలపల్లి శివారులో జెఎన్‌టియూ వెనుకున్న సింగరేణికి చెందిన 178 ఏకరాలను తమకు ప్లాట్ల క్రింద కేటాయించాలని, లేని యెడల ప్లాటు కింద ఒక్కొక్కరికి రూ. 6.50 లక్షలు నష్టపరిహరం ఇవ్వాలని, 2017 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల కు ఫుల్ ప్యాకేజీని వర్తింప జేయాలని, తప్పుల తడకగా చేసిన ఆర్ అండ్ ఆర్ సర్వే, జాబితాలో తప్పులను సవరించాలని, పెద్దం పేట అబాదీ, పట్టాలో ఇంక సింగరేణి తీసుకో కుండా పెండింగ్‌లో పెట్టిన ఇండ్లను వెంటనే తీసు కోవాలని, తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం కట్టి ఇవ్వాలని, భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.ఒకవేళ తమకు అనుకూల మైన నిర్ణయం రాకపోతే మరల ముట్టడికి సిద్ధ మవుతామని భూనిర్వాసితులు హెచ్చరించారు.

Comments

comments