Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సింగర్ అవతారమెత్తిన విజయ్ దేవరకొండ…

What The F Song Sung By Vijay Devarakonda Geetha Govindam

సినిమా: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రొమాంటిక్ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మిస్తోన్న ఈ సినిమా  పోస్టర్స్ తోనే యూత్ లో  భారీ అంచనాలని పెంచేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అటు లవర్ గాను.. ఇటు భార్యగాను కనిపించి ఈ టీజర్లో రష్మిక మందన ఆకట్టుకుంది. సినిమాలో రొమాన్స్ పాళ్లు ఎక్కువేననే సంకేతాలను ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకి ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ విజయ్ దేవరకొండ పాడినది కావడం గమనార్హం. ఈ సాంగ్ తర్వాత ఈ సినిమాపై ఇంకెంతగా క్రేజ్ పెరుగుతుందో చూడాలి. ఆగస్టు 15వ తారీఖున ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Comments

comments