Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..!

WhatsApp has announced it is rolling out group voice and video calls

ప్రముఖ సోషల్ మీడియా మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల కాలంలో తన వినియోగదారుల కోసం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతంలోనే ప్రకటించింది. దీని ద్వారా ఇకపై కస్టర్లు ఆడియోతో కూడిన గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో కాల్ చేసుకోవచ్చు. అయితే, మొదట ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టి, ఆ తరువాత ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

Comments

comments