Home టెక్ ట్రెండ్స్ వాట్సప్ యూజర్లు ఇక జాగ్రత్త: వాట్సప్ ద్వారా వైరస్

వాట్సప్ యూజర్లు ఇక జాగ్రత్త: వాట్సప్ ద్వారా వైరస్

whatsappన్యూఢిల్లీ: 2016 లో  వాట్సప్ గోల్డ్ అంటూ దుండగులు వాట్సప్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో వైరస్ ఎక్కించారు. అలాగే ఇప్పుడు కూడా ”మార్టినెల్లీ” అనే వీడియో వాట్సప్ లో జోరుగా ప్రచారం అవుతుంది. వాట్సప్ డెవలపర్ల తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఓపెన్ చేసిన 10 సెకన్లలో మీ ఫోన్ ని దుండగులు హ్యాక్ చేస్తారు. దీంతో  ఫోన్లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. వాట్సప్ వినియోగదారులు అలాంటి వీడియోస్ వస్తే క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.

WhatsApp Martinelli Virus Returns in 2019