Home టెక్ ట్రెండ్స్ ‘వాట్సాప్’లో వావ్ అనిపించే నయా ఫీచర్!

‘వాట్సాప్’లో వావ్ అనిపించే నయా ఫీచర్!

whatsappప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్  మరో సరికొత్త ఫీచర్ ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ… యూజర్లను ఆకట్టుకుంటుంది వాట్సాప్. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అద్భుత ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్ లో కొత్తగా ‘ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్’ ఫీచర్ తీసుకురానుంది. వాట్సాప్ చాటింగ్ రక్షణ కోసం ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని బీటా ఇన్ఫో సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది పరిశీలన దశలో ఉందని పేర్కొంది. ఐఒఎస్ లో ఫేస్ ఐడీ, టచ్ ఐడీల మీద పరీక్షించిన తరువాత అండ్రాయిడ్ ఒఎస్ లో పనిచేసేలా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వివరించింది.

WhatsApp to soon add fingerprint authentication Feature