Home ఎడిటోరియల్ వర్శిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు?

వర్శిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు?

Universities-of-Telangana

మన నీళ్లు, నియామకాలు, నిధులు మనకే దక్కా లనే లక్షంతోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ కలలు నెరవేరుతాయనే ఆశతో ప్రజలు ఎదురు చూశారు. కాని అనుకున్న దానికి విరుద్ధంగా పాలన కొనసాగుతున్నదని ఆశ్చర్య పోతున్నారు. అన్ని రంగాలు అభివృద్ధికి నోచుకోకుం డా వెనుకంజ వేస్తు న్నాయి. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల విషయంలో నవంబర్ 24, 2014లో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ, తెలంగాణ వాటాకు 5,23,675 పోస్టులు కేటాయించబడ్డాయని అందులో 1,07,744 ఖాళీలున్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేస్తామని అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఏడాదిలో పూర్తిచేస్తామని ప్రకటిం చారు. గడచిన మూడు సంవత్స రాలలో సుమారు 6వేలు మాత్రమే భర్తీ చేశారు. 10,448 కానిస్టేబుల్ పోస్టు లు ప్రస్తుతం కోర్టులో ఉన్నా యి. సంవత్సరం గడిచి పోయినా ఎస్‌ఐ. పోస్టుల ఫలి తాలు మాత్రం ప్రకటించడం లేదు. వీటన్నింటిని కలుపు కుని దాదాపు16వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.

తెలంగాణలో వున్న 13 విశ్వవిద్యాలయాలు నిరాదర ణకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం వీటి విషయం లో ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు. విశ్వ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఈ క్రింది వివరాలను బట్టి అర్థమౌతున్నది.
విశ్వవిద్యాలయం  మొత్తం పోస్టులు  ఖాళీల సంఖ్య

ఉస్మానియా             1,264               700
కాకతీయ                 390                  240
తెలంగాణ                 200                  130
మహాత్మగాంధీ          200                  170
శాతవాహన              200                  180
పాలమూరు             200                   190
అగ్రికల్చర్                631                    300
హార్టికల్చర్               226                    200
వెటర్నరీ                  222                     100
పొట్టి శ్రీరాములు       60                        35
జెఎన్‌టియు             409                     200
ఫైన్ ఆర్ట్                    75                       50
డా॥బి.ఆర్.అంబేద్కర్ 84                     32
ఓపెన్ యూనివర్శిటి
ఈ ఖాళీలను చూస్తే యూనివర్శిటీలలో బోధన ఏ విధంగా కొనసాగుతుందో అర్థం అవుతుంది. బోధ నేతర సిబ్బంది ఖాళీలు అన్ని యూనివర్శిటీలలో కలిపి సుమారు 1850 వరకు ఉన్నాయి. టీచింగ్‌లో కేవలం కాంట్రాక్టు అధ్యాపకులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. వీరు దాదాపు ఒక్క ఉస్మానియాలోనే 500 మంది వరకు ఉన్నారు.
– డిగ్రీ కళాశాలల్లో 2,150, జూనియర్ కళాశాల ల్లో 4,885 టీచింగ్ పోస్టులు, 800 వరకు నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు చెబు తున్నాయి. 926 మంది కాంట్రాక్టు అధ్యాపకులుతోనే ఇక్కడ కూడా బోధన జరుగుతోంది.
– టీచర్ పోస్టుల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. 2014 నవంబర్ 24న పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24,861, ఉన్నత విద్యాశాఖ పరిధిలో 10,592 ఖాళీలున్నాయని ఆర్థికమంత్రి అసెంబ్లీలో తెలిపారు. 2015 ఆగస్టులో పాఠశాలల్లో మొత్తం 17,702 టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని, అందులో వెయ్యివరకు హెచ్.ఎం. పోస్టు లు, 3,869 స్కూల్ అసిస్టెంటులు, 393, పి.ఇ.టిలు, 10,469 ఎస్.జి.టి. పోస్టులున్నాయని, 2015 డిసెంబర్ లో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిం దని పాఠశాల విద్యాశాఖలో 12,142 (తెలుగు మీడియం 10,927, ఉర్దూ మీడియంలో 1,217)ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– 2016 జులై16 అంతర్రాష్ట మండలి సమా వేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం 2016 మార్చి 31 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో ఎలిమెంటరీ స్కూళ్ళల్లో 1 నుండి 8వ తరగతి వరకు 13,049 పోస్టు లు, ఉన్నత పాఠ శాలల్లో 3,144 పోస్టులున్నాయని నివేదిక సమర్పించింది.
– 2016 నవంబర్‌లో ప్రభుత్వానికి విద్యాశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం పాఠశాలలో 11,329 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి 389 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది.
– 2017 అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రాష్ట్రంలోని పాఠశాలల్లో 8,792 టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని, వాటిని వచ్చే 6 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పారు.

ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు కలిసి నిరుద్యో గులను మోసం చేస్తున్నారు. ఎటువంటి నియామకాలు చేపట్ట కుండానే 2014 లో గల 24,861 ఖాళీలు 2017 నాటికి 8,792కి తగ్గిపోయాయి. ఎన్నోసార్లు భర్తీ చేస్తా మని ప్రకటనలకే పరిమితమైనాయి. జూన్ 2014 నుండి మూడువేలమంది వరకు రిటైర్‌మెంట్ అయినారు. నేడు నాలుగున్నర లక్షలమంది ఉద్యోగాల కొరకు వేచిచూస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్‌లో 24వేలమంది ఇరవై ఏండ్ల నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో దాదాపు 25సార్లు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ పని చేయడం లేదు. సింగరేణిలో 1,16,000 మందికిగాను ప్రస్తుతం 53వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం రెండు నుండి మూడువేల మంది వరకు పదవీ విరమణ చేస్తున్నారు. ఖాళీలు మాత్రం అలాగే వుంటు న్నాయి. పంచాయతీరాజ్‌శాఖలో 7,253 పోస్టుల కు గాను కేవలం 4,346 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 2,917 ఖాళీలున్నాయి. హౌజింగ్ కొర్పొరేషన్‌లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 1179 మంది ఉద్యోగ స్థులను అకారణంగా తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. వారికి ఎటువంటి దారి చూపడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

వివిధ శాఖల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, కాలేజి సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఇస్తున్న ప్రకటనలు ఇందుకు విరుద్ధంగా ఉన్నా యి. ఇటీవల రాష్ట్ర ఐటి శాఖామంత్రి రాష్ట్ర మేర్పడిన తర్వాత 2,250 కొత్త పరిశ్రమలు వచ్చా యని వాటివల్ల ప్రత్యక్షంగా 1,60,894 మందికి, పరోక్షంగా 4.5 లక్షలమందికి ఉపాధి లభించిందని చెప్పారు. అదే కాకుండా ఏఏ జిల్లాలో ఎన్ని కంపెనీలు వచ్చాయో అందులో ఎంత మందికి ఉపాధి లభించిందో అంకెల్లో కూడా ప్రకటించారు.మొత్తంగా ఇప్పటివరకు 2లక్షల పై చిలుకు ఖాళీ లున్నాయని తెలు స్తుంది. వీటిని తక్షణమే భర్తీ చేయ కుంటే యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవు తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత సంగతి చూద్దాం. 2013-14లో కేంద్రప్రభుత్వం చేసిన అధ్యయనం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా పనిచేయ గలవారు అంటే 15సంవత్సరాల వయస్సు దాటి పనిచేయ టానికి సిద్ధంగా ఉన్నవారు మొత్తం జనాభాలో 65.9 శాతం, గ్రామాల్లో 74.5, పట్టణాల్లో 51.4శాతం. వీరిలో కొందరు పని చేస్తున్నారు. మరి కొందరు పని వెతుక్కుం టున్నారు. గ్రామాల్లో 1.3 శాతం, పట్టణాల్లో 6.9శాతం నిరుద్యోగులు, పట్టణ మహిళ ల్లో 15.1శాతం నిరుద్యో గులే. పనిచేస్తున్న వాళ్లు కూడా గౌరవప్రదమైన ఆదాయం గల పనుల్లో లేరు. 46శాతం పనిచేయ గలవారు స్వయం ఉపాధి రంగం లోనూ, 35.1 శాతం కూలీనాలీ చేసుకుని బతుకు తున్నారు. 16.3శాతం మాత్రం నెలసరి వేతనంతో పని చేస్తున్నారు. పనిచేయ డానికి సిద్ధంగా ఉన్న వారిలో 44.2 శాతం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. వీరు సం॥లో 6 నుండి 11నెలలు మాత్రమే పనిచేస్తున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 15-29 సంవత్స రాల వయస్సుగల యువతీయువకుల్లో 50 శాతం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో 45.8 శాతం మంది పనుల్లో వున్నారు. విద్యార్హతలు పెరుగు తున్న కొద్దీ నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ ఆ పైన చదివిన వారిలో 13.4శాతం నిరుద్యోగుల సమస్య 1990 తర్వాత తీవ్రం కావడానికి సరళీకరణ ప్రధాన కారణం. సరళీకరణ వ్యవసాయం లో ఉద్యోగావ కాశాలను కుదించింది. చిన్న పరిశ్రమలకు చేయూత నివ్వలేదు. కేవలం సేవారంగంలోనే అవకా శాలు వచ్చాయి. అక్కడ వేతనాలు తక్కువే, నెలకు 10వేల రూపా యలు వేతనం పొందేవారు చాలా తక్కువగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమని అనుకున్నారు. కాని ఆ దిశలో ప్రయత్నమే జరగడం లేదు.
* ప్రొ॥ఇటికాల పురుషోత్తం,
రాష్ట్ర జెఎసి కో-ఛైర్మన్