Home సినిమా మళ్ళీ ఎప్పుడు?

మళ్ళీ ఎప్పుడు?

anus

సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న బ్యూటీ అనుష్క. ఇటీవల ఈ భామ ‘భాగమతి’ చిత్రంతో ఓ పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ చిత్రంలో నటిస్తుందనేది ఇప్పటివరకు సస్పెన్స్‌గానే ఉంది. అయితే ‘మహానటి’లో అనుష్క కేమియో రోల్‌లో నటిస్తుందనే టాక్ వినిపించినా ఈ వార్త తప్పు అని తెలిసింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ తన నెక్స్ మూవీగా ఏ సినిమాను చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది. ఇక ‘భాగమతి’ విడుదలకు ముందు తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ మల్టీస్టారర్ మూవీకి సైన్ చేశానని అనుష్క చెప్పింది. కానీ దర్శకుడి ట్రాక్ రికార్డు ప్రకారం ఏ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది ఎవరికీ తెలియదు. ‘భాగమతి’ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలా లేదా రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందా అనేది అనుష్క తేల్చుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను గ్లామర్ రోల్స్ చేయలేనని ఈమధ్య ఆమె చెప్పింది. దీంతో అనుష్క తన కొత్త చిత్రం చేయడానికి కొంత సమయం పట్టేటట్టు కనిపిస్తోంది.