Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఐఫోన్ ఆర్డర్ చేస్తే… వచ్చిదేంటో తెలుసా?

Online-Sales

ముంబయి: ఇప్పుడు అధికంగా కొనుగోలంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో దొరకని వస్తువు అంటూ లేదు. ఏది కావాలంటే అది… ఆర్డర్ చేసిన వెంటనే ఇంటికి వచ్చేస్తుంటాయి. అయితే ఆన్‌లైన్ వల్ల లాభం ఎంత ఉంటుందో.. మోసం కూడా అంతే ఉంటుంది. వినియోగదారుల అవసరాలను ఆన్‌లైన్ మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్న సంఘటనలు తరుచూ జరుగుతునే ఉన్నాయి.

తాజాగా ముంబయిలో ఓ వ్యక్తి రూ. 34 వేలు పెట్టి ఐఫోన్‌కు ఆర్డర్ చేస్తే వచ్చిదేంటో తెలుసా? ఫోన్‌లా ఫోల్డ్ చేసిన ఓ చిత్తు కాగితం. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 40 వేలు విలువ చేసే ఐఫోన్‌ను కేవలం రూ. 34వేలకే అందిస్తున్నట్లు ప్రకటన ఇచ్చి వినియోగదారుడిని బోల్తా కొట్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడి నుంచి సిమ్ కార్డులు, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా సదరు వ్యక్తి ఇదే విధంగా తప్పుడు ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నకిలీ ప్రకటనలు చూసి మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచిస్తున్నారు.

Comments

comments