Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

స్వచ్ఛత ఎక్కడ?

Neatnessమంచిర్యాల : బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించడంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి. బహిరంగ మలవిసర్జనను అరికట్టడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం ఆచరణలో సాధ్యం కావడం లేదు. అనేక పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఉన్నతాధికారులు ఎన్ని ఆదేశాలు ఇచ్చిన కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పనులను చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
నత్తనడకన నిర్మాణ పనులు
మరుగుదొడ్ల నిర్మాణ పనులు మంచిర్యాల జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీలో ఫైలేట్ ప్రాజెక్టు కింద 32 వార్డులలో పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్ఫష్టమైన ఆదేశాలు ఇచ్చిన్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. వివిధ వాడల్లో నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతా లలో ప్రజలు మలవిసర్జనకు బహిరంగ ప్రాంతాలకే వెళ్తుండడం అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. గత నెలలోనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదే శాలు ఉన్నప్పటికీ మున్సిపాలిటిలో పాటుఫైలేట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లోపనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడం మనార్హం. జిల్లాలోని మంచి ర్యాలలో ఇప్పటి వరకు సుమారు 2 వేల వరకు పూర్తి కాగా ఇంకా దాదాపు 500 వందల వరకు మరుగు దొడ్లు నిర్మించాల్సిఉంది.అలాగే లక్షెట్టిపేట మండలం లోని బలరావ్‌పేట్, దౌడపల్లి, జన్నారంలోని తిమ్మా పూర్, హాజీపూర్‌లోని పడ్తన్‌పల్లి, నస్పూర్‌లోని తాళ్లపల్లి, సింగాపూర్, బెల్లంపల్లిలోని పెద్దబూద, చిన్నబూద, కాసిపేటలోని కోనూర్, తాండూర్‌లోని అచ్చులాపూర్, దండేపల్లిలోని కన్నెపల్లి, చింతపల్లి, జైపూర్‌లోని నర్సింగాపూర్, టేకుమట్ల, వేమనపల్లిలోని సురారం, నెన్నెలలోని ఆవడం, గొల్లపల్లి, కోటపల్లిలో శెట్‌పల్లి, పంగిడి సోమారం, మందమర్రిలో చిర్ర కుంట, మామిడిగట్టు, చెన్నూర్‌లో చింతపల్లి, నాగా పూర్, భీమిని మండలంలో కర్జిభీంపూర్ ప్రాంతాలను ఫైలేట్ ప్రాజెక్టుల కింద ఎంపిక చేసినప్పటికీ మరు గుదొడ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. నగదు రహిత ఆర్థిక లావాదేవీలను నిర్వహించేం దుకు అధికారులు ప్రజలకు బ్యాంకింగ్‌పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో ఆశించిన స్థాయిలోస్పందన రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్వచ్ఛతెలంగాణలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా దృష్టి సారించడం ఎంతైనా అవసరం.

Comments

comments