Home అంతర్జాతీయ వార్తలు అంతర్జాతీయంగా ప్రతిభను పొందకుంటే.. యాపిల్, ఐబిఎంలు ఎక్కడ ఉండేవి

అంతర్జాతీయంగా ప్రతిభను పొందకుంటే.. యాపిల్, ఐబిఎంలు ఎక్కడ ఉండేవి

  • అమెరికా రక్షణవాద ధోరణి సరికాదు
  • వీసా నిబంధనల కఠినతరంపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ విమర్శలు

Urjit-Patel

న్యూయార్క్ : హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరంపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అవలంభిస్తున్న రక్షణవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నందుకే ట్రంప్ అధికార యంత్రాంగం వీసా నిబంధనలను కఠినతరం చేసిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ ఉత్పత్తులు, ప్రతిభను పొందకుండా ఉంటే యాపిల్, సిస్కో, ఐబిఎం వంటి అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవి అని అన్నారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ వద్ద భారతీయ ఆర్థిక విధానాలపై రాజ్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమంలో ఉర్జిత్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రధా నంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో స్వదేశీ వస్తురక్షణ విధానాలు పెరగడంపై అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. అమెరికాతో పాటు ప్రపంచంలో షేరు ధరలు అత్యంత సమర్థవంతమైన కార్పొరేషన్లు అని, గ్లోబల్ సరఫరా విధానం ఇప్పుడు నడుస్తోందని అన్నారు. అంతర్జాతీయ ప్రతిభను స్వీకరించకుంటే యాపిల్, సిస్కో, ఐబిఎం ఎక్కడ ఉండేవి అని అన్నారు. ఈ విధంగా నిబంధనలు తీసుకొచ్చినట్లయితే దేశంలో పెద్ద కంపెనీల ఆవిర్భావం ఎలా జరిగేది అని ప్రశ్నించారు. అమెరికా తదితర దేశాలు రక్షణవాద  విధానాలను పాటిస్తున్నాయని ఆరోపించిన ఆయన, పరస్పర సహకారం, విదేశీ ఉద్యోగుల వల్లనే అమెరికా దిగ్గజ కంపెనీలు నిలబడ్డాయని చురకలు అంటించారు. సంపద సృష్టికర్తలన్న పేరును తెచ్చుకున్న దేశాలే ఈ తరహా కఠిన వీసా విధానా లను అవలంబించడం తగదని సూచించారు. సమర్థవంతమైన మార్గంలో వెళ్లాలే తప్ప, వృద్ధికి తీరని నష్టం కలిగించే చర్యలు కూడదని సలహా ఇచ్చారు. దేశీయ ఆర్థిక విధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.  కొత్త హెచ్1 బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్  ఉర్జిత్ పటేల్ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణవాద విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన  ట్రంప్ హెచ్ 1 బీ వీసాల కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు. పరస్పర సహకారం లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్ర శ్నించారు. అమెరికా సహా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పో రేషన్ల విలువ గ్లోబల్ సప్లయ్  చైన్ల కారణంగానే పెరిగిందని గుర్తుచేశారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అవలంబిస్తే చివరికివారే ఈ ప్రభా వానికి లోను కావాల్సి వస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ హెచ్చరించారు. కస్టమ్స్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం  సమర్థవంతమైన మార్గం కాదని పేర్కొన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గం ఎంచుకువాల్సి ఉంటుందని అన్నారు. ఈక్విటీ, డిస్ట్రిబ్యూషన్స్ విధానాల్లో అనుసరిస్తున్న విధానాల కొన్నింటి ప్రభావం వారికి తెలియడం లేదని, ఇది వృద్ధికి తీరని నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు.  దేశీయ విధాన సమ స్యగా ఉండాలి. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరిం చుకోవాలని ఉర్జిత్ తెలిపారు. రూపాయి హెచ్చతగ్గులపై ఉర్జిత్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా మార్కెట్‌కు సంబంధించిన విషయమని, ఒడిదుడుకులను తగ్గిం చేందుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందని అన్నారు.