Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

లై డిటెక్టర్ ఎలా పనిచేస్తుందంటే..

Lie-Detector

సూపర్ సినిమాలో ఆలీని పోలీసులు పట్టుకుని అతడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అని అతనికి లై డిటెక్టర్‌తో పరీక్షలు చేయడం చూశాం. పడీపడీ నవ్వుకున్నాం.  లైడిటెక్టర్ ద్వారా వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు  అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు ఇదెలా పుట్టిందో చూద్దాం..1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో లైడిటెక్టర్ (LiDetector)ను రూపొందించాడు.

మానవ శరీరంలో రక్తపోటు, గుండెచప్పుడు, శ్వాసక్రియ, చెమటపట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్ ట్యూబు అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్త పోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు  ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తాయి.  లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం తో నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయ వ్యవస్థ  నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది. కానీ దాని సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు.

Comments

comments