Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

క్రిష్ మదిలోని దేవరాయలు ఎవరు?

Director-Krishదర్శకుడు క్రిష్ టాలెంట్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకపోయినా… కమర్షియల్ సక్సెస్‌లు కొట్టలేడనే ఓ స్టాంప్ మాత్రం మొన్నటివరకు ఉండేది. ఇటీవల బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో ఆ ముద్రను చెరిపేసుకున్నాడు ఈ డైరెక్టర్. అంతేకాదు చారిత్రక చిత్రంతో చరిత్ర సృష్టించే కలెక్షన్స్ రాబట్టవచ్చని నిరూపించాడు. అదే జోష్‌తో మరో రెండు హిస్టారికల్ మూవీస్ తీస్తానని కూడా చెప్పేశాడు. క్రిష్ చెప్పిన ఆ రెండు సబ్జెక్ట్‌లు ఏమిటంటే… శ్రీకృష్ణదేవరాయలు, గౌతమబుద్ధుడు. వీరి జీవితాలను తెరకెక్కించడం అంత సులువైన పనేమీ కాదు. బుద్ధుడి సంగతి అలా ఉంచితే… శ్రీకృష్ణదేవరాయలు పాత్రను పోషించేది ఎవరు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది. టాలీవుడ్ హీరోల్లో ఇలాంటి పాత్ర చేయాలంటే నందమూరి బాలకృష్ణ పేరు మాత్రమే వినిపిస్తుంది. పైగా ఆయన ఆదిత్య 369 చిత్రంలో ఇదే పాత్రను పాతికేళ్ల క్రితమే మెప్పించిన తీరు మర్చిపోలేం. ఇప్పుడు వేరేవాళ్లను చూడాలన్నా కొంచెం కష్టమే. ఇక ఒకరితోనే వరుసగా సినిమాలు తీస్తాడనే స్టాంప్ వేయించుకునేందుకు క్రిష్ ఇష్టపడడు. మరి క్రిష్ మదిలోని దేవరాయలు ఎవరు అనేది తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Comments

comments