Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మీ ఓటు ఎవరికో మీరే తేల్చుకోండి : బిజెపి పేపర్ యాడ్స్!

Bihar-Electionsపాట్నా : బీహార్‌లో మూడవ దశ ఎన్నికల ప్రచారం కాక పుట్టిస్తోంది. విమర్శల జోరు మరింత పెరిగింది. 23 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను నితీష్ తూర్పారబడుతూ రాసిన లేఖను తాజాగా బిజెపి బయట పెట్టింది. లాలూ పాలనలో అవినీతి, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రత్యేకించి ఒకే సామాజికవర్గానికే ఇస్తున్నారన్న ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. బిజెపి ఆ లేఖను శనివారం నాటి దినపత్రికల్లో ఫుల్‌పేజీ అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చింది. నితీష్ లాలూపై చేసిన ఆరోపణలను ఉదహరిస్తూ ఓటెవరికి వేయాలో మీరే తేల్చుకోవాలని కోరింది. ఈ లేఖను శ్రీకాంత్ అనే రచయిత రాసిన ‘చిత్తియన్ కీ రాజ్‌నీతి’ పుస్తకంలో ప్రచురించారు. ఈ లేఖను నితీష్ 1992 డిసెంబర్‌లో రాశారు. సామాజిక న్యాయం జరుగలేదని నితీష్ లాలూను ఆ లేఖ ద్వారా ఎండగట్టారు. అవినీతికి పాల్పడ్డారంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలతో కూడిన లేఖలు రాసుకుంటూ కేసులు పెట్టుకున్న నితీష్, లాలూ ఇద్దరూ తాజా ఎన్నికల్లో కూటమిగా జతకట్టారని, ఓటేవరికి వేయాలన్నది ఇక ఆలోచించుకోవాలని బిజెపి సూచించింది.

Comments

comments