Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టోకు ద్రవ్యోల్బణం దిగివచ్చింది

మే నెలలో 2.1 శాతం నమోదు
inflationన్యూఢిల్లీ : టోకు ధర సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డ బ్లూపిఐ) తగ్గుముఖం పట్టింది. ఆహార ధరలు భారీగా పడిపోవడంతో ఏప్రిల్ నెలలో డబ్లుపిఐ సూచీ 3.85 శాతం నుంచి మే నెలలో 2.17 శాతానికి చేరింది. దీంతో డబ్ల్యూపిఐ ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది మే నెలలో ఇది అత్యంత కనిష్ట స్థాయిలో 0.9 శాతంగా ఉంది. పప్పులు, తృణధాన్యాల ధరల్లో వృద్ధి కూడా చాలా తక్కువగా నమోదైందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సిపిఐ) కూడా రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అది కూడా 2.18 శాతానికి పడిపోయింది. ఈ రెండు సూచీలు దిగిరావడంతో ఆర్‌బిఐ రేట్ల కోత అంచనాలు పెరుగుతు న్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అంచనాలతో రిజర్వు బ్యాం కు ఇటీవల నిర్వహించిన సమీక్షలో వడ్డీరేట్లను యథా తథంగా కొనసాగించింది. ప్రస్తుతం తగ్గిన ద్రవ్యోల్బణం తో ఆగస్టులో నిర్వహించబోయే సమావేశంలో కచ్చితంగా రేట్లను తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
వరుసగా మూడో నెల ఇదే తీరు
తాజాగా విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా లో ఆహార ధరల ముఖ్యంగా బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు వరుసగా మూడో నెలలో కూడా కిందకి పడిపోయినట్టు తెలిసింది. ఈ సూచీలో ఇవి ప్రధాన వస్తువులుగా ఉంటాయి. మే నెలలో ఆహారోత్ప త్తుల దరలు 2.27 శాతానికి పడిపోయాయి. కూరగాయ లు ధరలు -18.51 శాతంగా నమోదయ్యాయి. బంగాళదుంపలు ధరలు కూడా 44.36 శాతం ప్రతి ద్రవ్యోల్బణంలో ఉన్నాయి. ఉల్లిపాయల రేట్లు 12.86 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. అయితే గతేడాది -14.78శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 11.69 శాతం పైకి ఎగిసింది. కాగా మే నెలలో వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.18 శాతంగా నమోదైంది. ఇది ఏప్రిల్ నెలలో 2.99 శాతంగా ఉంది. 2012 సంవత్సరం కనిష్ఠ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుంది. వరుసగా ఏడో నెల ఆర్‌బిఐ మధ్యకాలిక లక్షం 4 శాతం కంటే దిగువనే ద్రవ్యోల్బణం నమోదైంది. రిటైల్ ఆహార ధరలు గత ఏడాదితో పోలిస్తే 1.05 శాతానికి పడిపోగా, ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.61 శాతానికి చేరుకున్నాయి. పండ్ల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, కూరగాయలు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం కనిష్టానికి చేరడానికి కారణమైంది. వస్త్రాలు, ఇంధనం, గృహాల రేట్లు కూడా తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. 2016 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.76 శాతం ఉంది. కూరగాయల ధరలు 13.44 శాతం కిందకి పడిపోయాయి. పప్పులు, ఉత్పత్తులు కూడా 19.45 శాతానికి దిగివచ్చాయి.

Comments

comments