Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

శాంతించిన టోకు ద్రవ్యోల్బణం

Wholesale price inflation softens to 4.53% in August

ఆగస్టులో 4 నెలల కనిష్ఠానికి సూచీ                                                                                                                          4.53 శాతంగా నమోదు                                                                                                                                        కూరగాయల ధరల తగ్గుదలే కారణం

న్యూఢిల్లీ: కూరగాయల రేట్లు తగ్గడంతో ఆగస్టులో టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి చేరింది. కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) ప్రకారం, గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 4.53 శాతం నమోదవగా, అంతకుముందు జూలైలో 5.09 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో డబ్లుపిఐ 3.24 శాతం అంటే అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. ఆగస్టు 2018 నాటికి ఆహార ప్రతి ద్రవ్యోల్బణం 4.04 శాతంగా ఉండగా, గతేడాదిలో ఇది 2.16 శాతంగా ఉంది. శుక్రవారం సిఎస్‌ఒ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం గత నెలలో 1.73 శాతం నుంచి ఆగస్టు నెలలో 0.1 శాతానికి తగ్గింది. ఇంధన, విద్యుత్ రంగాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 17.73 శాతంగా నమోదైంది. 64 శాతం మెజారిటీ వాటా ఉండే ఆహార పదార్థాలు, పొగా కు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తుల టోకు ధరల సూచీ 0.3 శాతంగా నమోదైందని గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కూరగాయల ధరలు క్షీణించడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందిని తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఈ ద్రవ్యోల్బణ రేటు 1.18 శాతంగా నమోదు కాగా ఈ ఏడాది ఇదే కాలంలో ఈ ద్రవ్యోల్బణం రేటు 3.18 శాతంగా ఉంది.

రెండో రోజూ లాభాల జోరు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల వైపు పయనిస్తున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ కోలుకున్నాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్లు లాభపడి 38,090 పాయింట్ల వద్ద ముగిసింది. ఎట్టకేలకు సెన్సెక్స్ 38 వేల మార్క్‌ను దాటింది. ఇక నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11515 వద్ద స్థిరపడింది. భారీ పతనంతో విలవిల్లాడిన రూపాయి మళ్లీ కోలుకోవడం, మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరించడంతో మార్కెట్లు బలపడ్డాయి. బ్యాంకులు, ఆటోమొబైల్స్, మెటల్స్, ఫార్మా రంగాలు లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సెగ్మెంట్ కూడా పుంజుకోవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2 శాతం లాభపడింది. వేదాంత, భారతీ ఎయిర్‌టెల్, ఇండియాబుల్స్ హౌజింగ్, బిపిసిఎల్ ఎక్కువగా లాభపడగా, కోల్ ఇండియా నష్టపోయాయి.

అన్ని రంగాలూ లాభాల్లో…
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో అన్ని రంగాలు లాభపడ్డాయి. రియల్టీ 4 శాతం పెరగ్గా, మెటల్, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో 2 నుంచి 1 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబి హౌసింగ్, బిపిసిఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌పిసిఎల్, వేదాంతా, యుపిఎల్, ఐఒసి, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ పెరిగాయి. బ్లూచిప్స్‌లో హెచ్‌సిఎల్ టెక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లకూ డిమాండ్ పెరగ్గా, బిఎస్‌ఇలో ఈ సూచీలు 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1817 లాభపడగా, 842 మాత్రమే నష్టపోయాయి. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.1086 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 541 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments