Home లైఫ్ స్టైల్ ఆషాఢమంటే అంత భయమెందుకు?

ఆషాఢమంటే అంత భయమెందుకు?

Marriage

ఆషాఢమాసమంటే ఆడపిల్లలకు ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన దంపతులకు ఎంతో భయం. ఆషాఢమాసం కొలుపులకు, జాతరలకు ఎంతో ఖ్యాతి గడించినా ఈ మాసం చుట్టూ అనేక గుడ్డినమ్మకాలు, పుకార్లు గూడు కట్టుకున్నాయి. ఈ యేడాది ఆషాఢమాసం జూన్ 28న మొదలై జులై 26 వరకు కొనసాగుతుంది. ఆషాఢంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే అంతవరకు ఉత్తరాయ నంలో ఉన్న సూర్యుడు దక్షిణాయన యాత్ర మొదలు పెడతాడన్నమాట. దక్షిణాయనం పాపకా లమని, పుణ్యకార్యాలకు పనికిరాని కాలమని అంటారు. ఈ ఆరునెల కాలం దేవతలకు రాత్రి సమయం. అంతా విశ్రాంతి తీసుకునే సమయం కావడంతో పూజలు, పునస్కారాలని ఊదరగొట్టి వారి ఏకాంతానికి భంగం కలిగించకూడదనే భావనతో ఈ మాసంలో ఎక్కువగా అర్చనలు, ఆరాధనలు ఏర్పరచలేదు.   ఆషాఢ మాసం లో భార్యాభర్తలు కలిసి ఉండరాదని, అత్తా కోడళ్ళు ఒకే గుమ్మం దాటరాదని రకరకాల ఆంక్షలున్నాయి. కొత్తగా పెళ్ళయిన భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండరాదనే నియమాన్ని చాలా గట్టిగా పాటిస్తారు. అలా చేయడం వల్ల వారి మధ్య శృంగారానికి ఆస్కారం ఉండదు. అందువల్ల ఆడపిల్ల గర్భవతి అయ్యే అవకాశాలు ఉండవు. అలా జరగకుండా ఉండడానికే వారికి  ఎడబాటు కలిగిస్తారు. అలా చేయడం వల్ల రెండు లాభాలు. అప్పుడే పెళ్ళయిన వాళ్ళ మధ్య ప్రేమ మరింత పుంజుకోడానికి ఉపయోగపడుతుంది. ఈ మాసంలో ఆడపిల్ల కనుక గర్భవతి అయితే పురుడు మార్చినెలలో మంచి ఎండాకాలం వస్తుంది. చిటచిటలాడే  ఎండాకాలంలో ప్రసవవేదన భయంక రంగా ఉంటుంది. అది తల్లికి, పిల్లకు కూడా మంచిది కాదు. ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆషాఢమాసం వచ్చే ఆడ పిల్లలున్న ఇళ్ళలో గోరింటాకు సందడి మొదల వుతుంది. ఆషాఢమాసం నోములు వ్రతాలకు అంతగా చెప్పుకోదగ్గది కాకపో యినా ఈ మాసంలోనే పూరీజగన్నాథుడు ఊరేగింపుకోసం ఆలయం దాటి బైటకు వస్తాడు. ఆయనను దర్శించుకోడానికి లక్షలాది మంది పూరీ క్షేత్రానికి చేరుతుంటారు. దక్షిణాయనంలో సప్తమా తృకలుగా దర్శనమిచ్చే అమ్మవారికి సంబరాలు చేస్తారు. ఉత్తరాయణం వచ్చే వరకు అమ్మపేరుతో అన్ని పట్టణాలు, నగరాలలో పెద్దయెత్తున జాతరలు జరుగుతాయి. ఈ మాసంలోనే నారాయణుడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. సమాస్రాణాలు చేయించు కోడానికి ఈ మాసం ఎంతో అనువైనది. దీన్నే తప్తము ద్రధారణ అంటారు. ఈ మాసంలోనే వేదవ్యాసుడైన కృష్ణద్వైపాయనుడు జన్మించాడు. సరిగా ఆషాఢ పౌర్ణమినాడే ఆయన బ్రహ్మ సూత్రాల రచనకు శ్రీకారం చుట్టాడు. సుప్రసిద్ధ నృసింహక్షేత్రం సింహాచలంలో గిరిప్ర దక్షిణ కార్య క్రమం కూడా గురుపూర్ణిమనాడే జరుగుతుంది.