Home తాజా వార్తలు చావుబాట.. వితంతువుల తండా

చావుబాట.. వితంతువుల తండా

NH-44-highway

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్-44కు బైపాస్ రోడ్డుపై నిరంతరం ప్రమాదాలు  30 మంది పురుషులను బలి తీసుకోవడంతో మగదిక్కు లేని ఊరుగా మారిన పెద్దకుంట తండా

హైదరాబాద్: ఆ రోడ్డు కాలనాగులా బుస కొడుతూ, ఓ ఊరినే ఇప్పుడు వితంతువుల ఊరుగా మార్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దూసుకువెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-44కు బైపాస్ రోడ్డుగా ఉన్న రహ దారి ఇప్పుడు నెత్తురు చిందించే హంతక రహదారిగా మారింది. పెద్దకుంట తండాలోని మగవారిని దిగమింగేసిన నెత్తుటిదారిగా బుసలుకొడుతోంది. ఒకే తెగకు చెందిన 40 కుటుంబాలతో అల్లుకుపోయిన పొదరిల్లులా ఉండేటి ఈ కు గ్రామం నుదుటి రాతను మార్చింది. ఊర్లోని ఆడవారి నుదుటి బొట్లను చెరి పేసింది. ఇక్కడ ఇప్పుడు ఈ తండాకు మిగిలిన ఒకే ఒక్క పెద్ద మగదిక్కు వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ఈ తండాలో మిగిలిన వారంతా వితం తువులే. రాత్రిపూట ఎవరెవరో వచ్చి తమ ఇళ్ల తలుపులు కొడుతూ ఉంటారని, తమకు మగ దిక్కులేదని వారు అరాచకాలకు దిగే యత్నాలు చేస్తుంటారని, సమీప ప్రాంతాల నుంచి వచ్చే వారితో తమకు రాత్రి అయిందంటే చాలు దిక్కు తోచని స్థితి ఏర్పడుతోందని ఆడవారు వాపోతున్నారు. భర్తలను కోల్పోయిన వారంతా కూడా 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే కావడంతో వారు తమకు ఎలాంటి ఆపద వచ్చిపడుతుందో అనే భయంతో బతుకుతున్నారు.  తమకు సమీపంలోనే పెద్ద రోడ్డు వచ్చిందని, ఎన్‌హెచ్ 44కు బైపాస్ పడటంతో తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ తండా వారు ఆశపడ్డారు. ఐదు కిలోమీటర్ల దూరంలోని పంచాయతీ కేంద్రం నంది గామ్‌కు వెళ్లడానికి సర్వీసు రోడ్డు బాగా ఉపయోగపడుతుందని అనుకు న్నారు. సురక్షితంగా గమ్యాలకు చేరుకోవచ్చు నని తలపోశారు. అయితే వా రికి సర్వీసు రోడ్డు రాలేదు. కానీ 2006 జనవరిలో బైపాస్ రోడ్డు రావడంతో ఇక ఈ ఊరి వారి బతుకులు నరకానికి చేరువ అయ్యాయి. బైపాస్‌రోడ్డులో యముని మహిషం బాపతుగా దూసుకువెళ్లే వాహనాలకు బలి అయ్యారు. పలు సార్లు రోడ్డు ప్రమాద ఘటనలు జరిగి, పలువురు ప్రాణాలు పొగొట్టు కున్న ఘటనలు చివరికి హిట్ అండ్ రన్ కేసులగా మిగిలాయి. ఇప్పటి వరకూ ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలతో మొత్తం 80 మంది చనిపోగా వా రిలో 30 మంది పెద్దకుంట వారు, ఇద్దరు బండకుంట వారు కాగా మిగి లినవారంతా సమీప గ్రామాలకు, తండాలకు చెందినవారే. ఈ హంతక రహ దారిలో తమ కుటుంబంలోని నలుగురు మగవాళ్లను పోగొట్టుకున్న 52 ఏళ్ల నీనావతి రుక్యా తన కడుపు శోకంతో వయస్సుకు మించిన ముసలిగా మా రింది. అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె ముగ్గురు కొడుకులు కొర్ర మల్లేష్ (26), శంకర్ (21), రవి (18)లను రోడ్డు మింగేసింది. గుర్తు తెలి యని వాహనం ఒకటి వారిని ఢీ కొనడంతో చనిపోయారు. వారిని చంపేసిన వాహనం తప్పించుకుపోయింది. ఆరు నెలల తరువాత ఆమె అల్లుడు కూడా అదే చోట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ‘ఏం చెప్తం ఇది దేవుడి శాపం అనుకుంటన్నం. ఇంతకు మించి ఎవరిని అని ఏం ఫాయిదా’ అని ముసలి రుక్యా గొల్లుమంది. మంచంలో నుంచి లేవడానికి, పడుకునేందుకు య మయాతన పడుతూ ఉన్న ఆమె తమ గ్రామంలో మగవాళ్లందరిని ఈ పాడు రోడ్డు తీసుకువెళ్లిందని, మేం ఏం పాపం చేసినం …’ అని వచ్చిపోయే వారిని అడుగుతోంది. ఓ వైపు కొడుకులు పోయిన బాధతో ఉన్న ఆమెకు వితంతు వులుగా మారిన కోడళ్లను పక్క ఊళ్ల మగాళ్ల నుంచి రక్షించుకోవడం పెద్ద స మస్యగా మారింది. తరచూ మగవాళ్లు ఇంటి దగ్గరికి వచ్చి వెకిలి చేష్టలకు పాల్పడే వారని, దీనితో చేసేది లేక తాను కూతుళ్లుగా చూసుకునే వారిని బల వంతంగా వారి రక్షణ కోసం పుట్టిండ్లకు పంపించినట్లు రుక్యా కన్నీటి పర్యం తమైంది. ఇప్పుడు ఈ తండాలో మగదిక్కు కోల్పొయిన ఇళ్లలో ఆరు ఇండ్ల వారు ఇండ్లకు తాళాలు వేసి దూరంగా వలస వెళ్లిపోయారు. ఇక్కడ ఉండి మరిన్ని కష్టాలు పడే బదులు వేరే చోటికి వెళ్లి కష్టపడి కనీసం కంటి నిండా కునుకు తీయవచ్చునని వారు ఎవరికి చెప్పకుండా వెళ్లారు. 20 ఏళ్ల వితంతు వు నీనావతి తులసీ జిల్లాలోని రంగాపూర్‌లోనే ఉండే తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఒంటరిగా ఉండలేక తాను తప్పనిసరిగా పుట్టింటిని వెతుక్కుంటూ రావల్సి వచ్చిందని తెలిపింది. ప్రతి వారం ఈ రోడ్డులో కనీసం రెండు మూ డు ప్రమాదాలు జరుగుతాయని మరో వితంతువు పద్మ తెలిపింది. భర్తను రో డ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న 39 ఏళ్ల కొర్ర పన్ని ఇక్కడ తన పిల్లలు అయి నా భద్రంగా ఉంటారనే నమ్మకం లేక వారిని కొత్తూరు, షాద్‌నగర్ ప్రభుత్వ హాస్టళ్లకు పంపించినట్లు తెలిపింది. షాద్‌నగర్‌లో రోజువారి కూలీగా పనిచేసే భర్త 2013 ఆగస్టు 13న ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతుండగా వే గంగా దూసుకువచ్చిన వాహనానికి బలి అయ్యాడు. ఇప్పుడు తన చిన్న కొడుకుతో బతుకుతోన్న కొర్ర పన్ని దినదినగండంగా ఉందని తెలిపింది.
పింఛనప్పుడో దండం…ఇంటికొచ్చినప్పుడో దండం
ఈ తండాలోని వితంతువులకు ప్రభుత్వం నెలవారి పింఛన్లు ఇస్తోంది. దీనిని తీసుకోవడానికి నెలకోసారి ఎన్‌హెచ్ -44 వితంతువులు 5 కిలోమీటర్ల దూ రంలోని పంచాయతీ కేంద్రం నందిగామకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లివచ్చి ప్పుడల్లా వారికి రెండుసార్లు బైపాస్ దాటడం వారికి కత్తిమీద సాము అవు తోంది. పింఛన్ సరిగ్గా అందడానికో దండం. అందిన తరువాత రోడ్డుమీద బండ్ల బారిన పడకుండా ఇంటికి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చిందుకో దం డం పెట్టుకోవల్సి వస్తున్నదని వితంతువులు తమ బాధ వ్యక్తం చేసుకున్నారు.