Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భార్యకు ప్రేమతో..

Wife

అతడికి భార్యంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే.. ఆమె కోసం గిటార్ రూపంలో ఒక వనాన్నే సృష్టించేంత! మీరు అనుకుంటున్నట్టు ఏ షాప్‌లో గిటార్ ఇప్పించమని అడగలేదు ఆవిడ. గిటార్ రూపంలో అడవిని సృష్టించి ఆమె కోరికను నెరవేర్చాడు.

అర్జెంటీనాలోని పంపాకి చెందిన పెడ్రో మార్టిన్ ఉరెటాకి తన భార్య అంటే ఎంతో ఇష్టమట. ఒక రోజు మార్టిన్ తన భార్య గ్రాసిల ఎరిజాజ్ కలిసి విమానంలో పంపా మీదుగా ప్రయాణిస్తున్నారు. అక్కడ నుంచి కిందకి చూడగా వారి పొలం కనిపించింది. ఆ పొలం చూడటానికి చాలా మాములుగా కనిపించింది గ్రాసిలాకి. పొలాన్ని గిటార్‌లా మార్చి తనకు గిఫ్ట్‌గా ఇవ్వమని అడిగింది. ఆమె కోరికను అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు మార్టిన్. కొన్నిరోజుల తర్వాత 1977లో గ్రాసిలా అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికే మార్టిన్‌కి 71 సంవత్సరాలు. భార్య కోరిక అలాగే మిగిలిపోయింది.

మార్టిన్‌కు నలుగురు కుమారులు. గ్రాసిలా జ్ఞాపకార్థం పిల్లల సాయంతో గిటార్ వనాన్ని ఏర్పాటు చేయాలనుకొన్నాడు. 7,000 మొక్కలతో వనాన్ని తయారుచేశారు. ఈ వనం ఇప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎత్తైన ప్రదేశాల నుంచి కిందికి చూడడానికి మార్టిన్‌కు భయమట. అందువల్ల మార్టిన్ గిటార్ రూపంలో ఉన్న వనాన్ని ఫొటోలో తప్ప ఎప్పుడూ నిజంగా చూడలేదు. ఇది ఇప్పుడు ప్రపంచంలోని ప్రేమికులకు అందమైన పర్యాటక ప్రాంతంగా మారింది.

Comments

comments