Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐసియులో భర్త.. పక్కనే భార్య, ప్రేయసి కొట్లాట!

Women-Fighting

గ్వాలియర్ : భార్య, ప్రేయసిల మధ్య జరుగుతున్న గొడవలు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ వ్యక్తి ఐసియులో చికిత్స పొందుతున్నాడు. కాగా ప్రాణాలతో పోరాడుతున్న ఆ వ్యక్తిని కంటికి రెప్పలా చేసుకోవాల్సిన భార్య, అతని ప్రేయసి అతనికి పెను సమస్యలా మారారు. తన భర్తను వలలో వెసుకుందని భార్య, తన ప్రియుడిని హింసిస్తుందని ప్రేయసి ఇద్దరు జట్టు జట్టు పట్టుకొని ముష్టి యుద్ధానికి దిగారు. అది కూడా అతడు చికిత్స పొందుతున్న ఐసియులోనే..

వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్ కు చెందిన షాదాబ్‌ అలి అనే వ్యక్తి ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. షాదాబ్‌ ఇదే ప్రాంతానికి చెందిన ప్రేమలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ అప్పటికే ప్రేమలతకి మరో వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ వీళ్లిరువురు కలుసుకోవడం మానలేదు. ఆ తర్వాత షాదాబ్‌కి ఆస్మా అనే యువతితో పెళ్లైంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టినా షాదాబ్‌ తన మాజీ ప్రేయసితో సంబంధం తెంచుకోలేదు. అయినప్పటికీ ప్రేయసితో షాదాబ్ సంబంధం తెంచుకోలేదు. దీంతో అస్మా, ప్రేమలతకి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు భరంచలేక షాదాబ్ కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేశాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో బతికి బయటపడ్డాడు.

అయితే ఈ నేపథ్యంలోభర్తను దగ్గరుండి చూసుకోవాలని ఆస్మా, ప్రియుడి కోసం ప్రేమలత ఇద్దరూ హాస్పిటల్‌కి వెళుతుండేవారు. షాదాబ్ ఐసియులో కోలుకుంటున్న సమయంలో తాజాగా మాటా మాటా పెరిగి అస్మా, ప్రేమలత కొట్లాటకు దిగారు. వాళ్లిద్దరిని ఆపే క్రమంలో షాదాబ్ చేతికున్న సెలైన్ కూడా తెగి కింద పడింది. వీళ్ల అరుపులు విన్న ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని వాళ్లని అదుపు చేశారు. దీంతో పరిస్థతి సద్దుమణిగింది.

Comments

comments