Search
Monday 24 September 2018
  • :
  • :

కొత్తకాపురంలో పచ్చబొట్టు చిచ్చు..!

Wife beat Husband after saw the another girl name Tattoo on his hand

చెన్నై: కొత్తకాపురంలో పచ్చబొట్టు చిచ్చు రేపిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయం గురువారం జరిగింది. భర్త చేతిపై మరో యువతి పేరు ఉండటంతో సహించలేకపోయిన నవ వధువు ఆలయంలోనే అతడికి దేహశుద్ధి చేసింది. వివరాల్లోకి వెళితే… మెట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం కొత్త జంట దర్శనం కోసం వెళ్లింది. దర్శనం అనంతరం దంపతులు గుడి మెట్లపై కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. ఆ సమయంలో భర్త చేతిపై మరో యువతి పేరుతో పచ్చబొట్టు కనిపించింది. దాంతో భార్య ఆ పేరు ఎవరిదని ప్రశ్నించింది. దానికి భర్త నుంచి సరియైన సమాధానం రాకపోవడంతో ఆలయమని కూడా చూడకుండా అతడిని చెడుగుడు ఆడేసింది. భర్త జుట్టుపట్టుకుని దేహశుద్ధి చేసింది. ఇది చూసిన ఆలయానికి వచ్చిన భక్తులకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు.

Comments

comments