Search
Saturday 17 November 2018
  • :
  • :

భర్తను కడతేర్చిన భార్య!

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

జనగామ: భర్తను భార్య హతమార్చిన దారుణ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని గౌడకాలనీలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ధర్మయ్య(50)ను భార్య కాంతమ్మ అతి కిరాతకంగా కర్రలతో కొట్టి చంపేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments