Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భర్తను సజీవ దహానం చేసిన భార్య

BURNEDఖమ్మంః వివాహేతర సంబందం పెట్టుకొని కట్టుకున్న భర్తను సజీవ దహానం చేసిన సంఘటన మండల పరిధిలోని ఆశన్నగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆశన్నగూడెంకు చెందిన గుర్రాల వెంకట రమణ అనే వివాహిత దమ్మపేటకు చెందిన దేవదానం అనే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుంది. తమ అక్రమ సంబందానికి భర్త గుర్రాల క్రిష్ణ(38) అడ్డుగా వుంటున్నాడని అతని అడ్డును తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించిన రమణ గురువారం అర్దరాత్రి మొగుడిపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడి నుడి పరారైంది. తండ్రి కాలిపోవటం చూసిన పిల్లలు కేకలు వేయటంతో చుట్టు ప్రక్కల వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మరణించడంతో ఈ విషయం పోలీసులకు తెలిపారు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతుడి సోదరుడు గుర్రాల రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిష్ణ,వెంకట రమణల వివాహామై 15 సంవత్సరాలు కావస్తుందని వీరికి ఇద్దరు అడపిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

Comments

comments