Home తాజా వార్తలు భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య..

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య..

wife committed suicide with her husband harassment

రంగారెడ్డి: భర్త వేదింపులతో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన గడ్డమీద లక్ష్మీనారాయణగౌడ్, మంగమ్మ దంపతుల కూతురు నవీన(25)కు అనాజ్‌పూర్‌కు చెందిన తోర్పునూరి లింగస్వామితో 2012లో వివాహం జరిగింది. డ్రైవర్ వృతి చేస్తున్న లింగస్వామి ఏడాది పాటు ఎలాంటి గొడవలు లేకుండా భార్య, భర్తలు జీవనం సాగించారు. కొంత కాలం తరువాత భర్త లింగస్వామి తాగుడికి బానిసై ఇళ్లు, బంగారం ఇతరితర వస్తువులు అమ్మేశాడు. మృత్యురాలిని వేధిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె తన తల్లిందడ్రులకు విషయం తెలియజేసింది. గతంలో ఓ సారి తనను తన భర్త  మనసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లింగస్వామి తిరిగి తన భార్యను మంచిగా చూసుకుంటాన్నాని తాగుడు మనేస్తా అంటు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. అప్పటి నుండి భార్య, భర్తలు ఇద్దరు మంచిగానే ఉన్నారు. కాగా.. గత రెండు రోజుల నుండి లింగస్వామి తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. దాంతో మనస్థాపానికి గురైన నవీన ఇంట్లో వంటి పై కిరోసిన్ పోసుకున్న ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రంగా గాయాపడిన నవీనను ఉస్మానియ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ.. మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.