Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

భార్య చేతిలో భర్త దారుణ హత్య

Wife Killed Her Husband In Jagoan District
పాలకుర్తి : వ్యవసాయ భూమిని తన ఆడబిడ్డకు ఇస్తాడేమోనని భర్త పై అనుమానంతో రోకలి బండతో కొట్టి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన వాసూరి చిన్న కొమురయ్య (65) పాలకుర్తిలోని తన కుమారుడు నివాసం ఉంటున్న ఇంటిలో భార్య లక్ష్మి చేతిలో హత్యకు గురైనట్లు తెలిపారు. మృతుడు చిన్న కొమురయ్య భార్య లక్ష్మి కుటుంబ కలహలతో గత 30 ఎళ్ళుగా వేరు వేరుగా జీవనం కొనసాగిస్తున్నారు. లక్ష్మి మండలంలోని ముత్తారం గ్రామంలోని తల్లిగారి ఇంటిలో ఉంటుండగా భర్త కొమురయ్య స్వగ్రామమైన వల్మిడిలో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్య భర్తలు ఇరువురు కలిసి కుమారుడైనా రవిందర్‌కు ఎకరంన్నర వ్యవసాయ భూమిని ఇచ్చారు. రవిందర్ స్వగ్రామమైన వల్మిడిలో ఇంటి నిర్మాణం చేపట్టగా కుటుంబ సభ్యులతో కలిసి పాలకుర్తి నుండి వల్మిడికి వెళ్ళారు. ఇంటికి నూతన దర్వాజను ఎత్తే క్రమంలో మృతుడు కొంరయ్య చెల్లెలు సానిక మణెమ్మ మృతుడి భార్య లక్ష్మికి మధ్య గొడవ జరిగింది. ఆస్థిలో మృతుడి చెల్లెలికి వాటా ఇచ్చెందుకు అంగీకారం తెలిపాడు. దీంతో కుమారుడు రవీందర్ పాలకుర్తిలో కిరాయికి ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చి రాత్రి నిద్రిస్తున్న కొంరయ్య తలపై భార్య లక్ష్మి రోకలి బండతో బలంగా తలపై కొట్టడంతో కొంరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్థిలో వాటా ఆడ బిడ్డకు వాటా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు భర్తను హత్య చేసినట్లు నిందితురాలు లక్ష్మి పోలీసుల ముందు అంగీకరించింది. ఘటనా స్థలాన్ని వర్దన్నపేట సిఐ మధుసుధన్ సందర్శించి పరిశీలించారు. మృతుడి చెల్లెలు సానిక మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు.

Comments

comments