Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

భర్తను హత్య చేసిన భార్య

Wife Killed Her Husband In Kamareddy Jilla

నిజామాబాద్ క్రైం: కట్టుకున్న భర్తను కడతేర్చిన వైనం.భర్తను అతి దారుణంగా ఇటుకతో కొట్టి చంపిన భార్య సంఘటన గురువారం అర్థరాత్రి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్‌లో చోటు చేసుకుంది. బీర్కూర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కిష్టాపూర్ గ్రామానికి చెంది గైని హన్మండ్లు (35) భార్య గంగామణి భార్య భర్తలు. వీరి మధ్య గత కొంత కాలంగా తగాదాలు వస్తున్నాయి. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని, తరుచు  భార్య భర్తలు గొడవలు పడేవారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో రోజు రోజుకు వీరి మధ్య పెరిగిన గొడవలతో విసిగిన భార్య నాగమణి గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భర్త వరండాలో మద్యం మత్తులో పడుకొని ఉన్న సంగతి గమనించి భర్త తలపై ఇటుకతో బాది, పక్కనే ఉన్న బండరాయితో తల బద్దలు కొట్టడంతో తీవ్ర రక్త స్రావంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఏమి తెలియనట్లుగా శుక్రవారం ఉదయం వరకు పడుకొని తెల్లవారుజామున పక్కింటి వారిని పిలిచి భర్త చనిపోయాడని బోరున విలపించడంతో స్థానికులు, వారి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి బాన్సువాడ సిఐ శ్రీనివాస్, బీర్కూర్ ఎస్ఐ ప్రశాంత్‌లు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. భార్య భర్తల గురించి స్థానికులను అడిగి తెలుసుకోగా తరుచూ గొడవ పడే వారని చెప్పడంతో పోలీసులు భార్యను విచారించడంతో ఆ నేరం ఆమె చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని శవ పంచనామ చేసి బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 హత్యతో అనాధలైన పిల్లలు 
కుటుంబ కలహాలతో క్షణికావేశంలో కట్టుకున్న భర్తను హత్య చేయడంతో వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు శివరంజిని(9), గణేష్(5)లు అనాధలయ్యారు. కండ్ల ముందే తండ్రి శవాన్ని చూసి ఆ చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలుకావడంతో మృతుని చిన్నతమ్ముడు పిల్లలను చేర దీసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments