Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

 పాలేరు వాగులో రమేష్ మృత దేహం లభ్యం

Wife Killed Her Husband Taking Help Her Boyfriend

అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నడని భర్తను హత్య చేయించిన భార్య…మిస్టరి చేధించిన ఖమ్మం ట్రీటౌన్ పోలీసులు.
మనతెలంగాణ/గార్ల; పచ్చని పందిట్లో అగ్నిసాక్షిగా వేదామంత్రాల నడుమ నిండునూరేళ్ళ జీవనం కోనసాగిస్తామని పెద్దల సమక్షంలో ఒక్కటైన భార్య భర్తలు సభ్య సమాజం తలవంచుకోనే విధంగా కట్టుకున్న భర్తను కాదని కండ్ల ముందే పరాయి మాగాడితో అక్రమ సంబంధం పెట్టుకోని తమ సుఖాలకు అడ్డుపడుతున్నాడనే సాకుతో ప్రియుడితో కలిసి పధకం ప్రకారం భర్తను హత్య చేయించిన విషాధ సంఘంటన గార్ల లో చోటు చేసుకుంది. ఖమ్మం ట్రీటౌన్ సిఐ వెంకన్న బాబు తెలిపిన వివరాల ప్రకారం మహబుబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సేరిపురం గ్రామానికి చెందిన భూక్యా రమేష్ ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తు గార్ల పట్టణంలో తాహశీల్ధార్ బజార్‌లో నివాసం ఉంటున్నాడు. రోజు వారి ట్రాక్టర్ పనులకు పోతున్న సమయంలో అదే బజార్ చెందిన అగాల రామారావు అలియాస్ రాముడుతో రమేష్ భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగిందని సిఐ తెలిపారు. భర్త అడ్డు తోలగించుకోవాలని పధకం ప్రకారం ఈనెల 12ట్రాక్టర్ రీపేర్ పనులపై రామారావుతో పినిరెడ్డి గూడెంకు చెందిన కిష్టాచారి ఇరువురు కలిసి రమేష్‌ను ఖమ్మంకు తీసుకరావడం జరిగింది.

ట్రాక్టర్ రీపేరు పనులు జరుగుతున్న క్రమంలో మరో జెసిపి డ్రైవర్ నరేష్‌తో పరిచయం ఏర్పడిదని సిఐ తెలిపారు. దింతో నరేష్‌తో పాటు ఉంటు జెసిపి డ్రైవింగ్ నేర్చుకుంటాని రమేష్ భార్య కమలతో ఫోన్ మాట్లాడడం జరిగిందన్నారు. దిన్నే అదునుగా భావించిన రామారావు కమల పథకం ప్రకారం ఖమ్మంలోనే చంపాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరుసటి రోజు రమేష్ గార్ల వస్తున్నారని భార్య కమల తెలపడంతో అనుకున్న సమయానికి హత్య చేయాలనే అలోచనతో ఖమ్మం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రమేష్‌ను రామారావు కిష్టాచారి ఇరువురు ద్విచక్ర వాహనంపై వచ్చి కుసుమంచిలోని వైన్స్‌లో ఎక్కువ మోతాదులో మద్య తాగించి రమేష్ను రాజుపేట మార్గంలోని పాలేరు ఏటి కాలువలో సమీపంలో బ్లెడ్‌తో గొంతు కోసి హత్య చేసి కాలువలోని గుర్రపుడెక్కే పోదలో వేయడం జరిగిందని సిఐ వెంకన్న బాబు తెలిపారు. తన భర్త కబడడంలేదని ఈనెల 21న ఖమ్మం ట్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో మృతిడి భార్య కమల ఫిర్యాదు చేయడంతో పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన పోలీసులు రామారావు కమల ఫోన్ కాల్‌ డాటా సేకరించి అసలు నిందుతులను గుర్తించి కేసు మిస్టరి చేధించడం జరిగింది. ఈ కేసులో ఇంకా పురోగతి సాదించేది ఉందని సిఐ వెంకన్న బాబు తెలిపారు. హత్యకు పాల్పడిన రామారావు, కిష్టాచారి పోలీసుల అదుపులో ఉండగా భార్య కమల పరారీలో ఉందని సిఐ తెలిపారు.

Comments

comments