Home జాతీయ వార్తలు భర్తను చంపి.. రాత్రంతా శవంతోనే…

భర్తను చంపి.. రాత్రంతా శవంతోనే…

Chandilapalem Sub Sarpanch Murdered in Nalgonda District

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని చెంబూర్ స్లమ్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను ఓ భార్య అతి దారుణంగా చంపేసి రాత్రంతా శవం పక్కనే నిద్రపోయింది. గత శనివారం రాత్రి ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే మౌర్య(75)కు ధన్‌దేవీ(65)తో నలభై ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతుకు ముగ్గురు పిల్లలు. అయితే మద్యానికి బానిసైనా మౌర్య గత కొంతకాలంగా భార్యతో గొడవపడుతున్నాడు. అంతేగాక అతడికి ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం కూడా ఉంది. ఈ విషయమై వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో మౌర్య ఆరుబయట పడుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికి భర్త నిద్రిస్తున్న సమయంలో బయటకు వచ్చిన ధన్‌దేవీ అతడి తలపై బండరాయితో మోది హత్య చేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా రాత్రంత భర్త శవం పక్కనే నిద్రించింది. అయితే తెల్లవారుజామున పెట్రోలింగ్ కోసం పోలీసులు అటుగా వెళ్తున్న సమయంలో రక్తపుమడుగులో పడి ఉన్న మౌర్యను గమనించారు. దాంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి ధన్‌దేవీని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో మొదట బుకాయించిన ఆమె తరువాత నేరాన్ని అంగీకరించింది. కుటుంబ గొడవల కారణంగానే భర్తను చంపిన్నట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.