Home తాజా వార్తలు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Murder

 

మనతెలంగాణ/మన్సూరాబాద్ : అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన అనంతరం ఊరి వేసికోని చనిపోయాడని నాటకమాడిన  ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని రంగారెడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎల్బీనగర్ ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి పృథ్వీథర్‌రావు, ఎల్బీనగర్ సిఐ ఆశోక్‌రెడ్డి, డిఐ కృష్ణమోహన్‌లు విలేకరుల సమావేశంలో బుధవారం నిందితుల వివరాలు వెల్లడించారు. పులి కాశయ్య (40), పులి నాగలక్ష్మి (30) భార్యభర్తలు ఎల్బీనగర్ ఎస్‌బిహెచ్‌కాలనీలో వెంచర్ 3లో సుకృతి అపార్ట్‌మెంట్‌లో కాశయ్య దివ్వాంగుడు కావడంతో వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాడు. నాగలక్ష్మి ఇండ్లలో పని చేసేది. నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం కట్టం వారి గూడెంకు చెందిన కొండ సైదులు (25) ప్రవేట్ ఉద్యోగం చేస్తు ఎస్‌బిహెచ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సైదులు, కాశయ్య కుటుంబ సభ్యులు ప్రక్క ప్రక్కనే నివాసం ఉండేవారు. దీంతో కాశయ్య భార్యకు నాగలక్ష్మికి, సైదులు అక్రమ సంభందం ఏర్పడింది. కాశయ్య విషయం తెలిసి అక్కడి నుంచి ఇల్లు వేరే దగ్గరికు మార్చారు.

ఇల్లు మార్చిన కూడా వీరిద్దరి అక్రమ సంబంధం కొనసాగుతుంది. దీంతో భర్త అడ్డువస్తున్నాడని నేపథ్యంలో నాగలక్ష్మి, సైదులు కలసి ఓక నెల క్రితం కాశయ్యను హతమర్చాలని గత నెల రోజుల నుంచి పన్నాగం పన్నారు. శనివారం రోజున నాగలక్ష్మి, సైదులు కలసి రాత్రి సమయంలో కాశయ్య మూతి మూసి త్రాడుతో గోంతు నులిమేయగా అక్కడిక్కడే కాశయ్య చనిపోయారు. దీంతో వారిద్దరు కలసి చీరెతో ఊరి వేసుకోని చనిపోయాడని చిత్రీకరించారు. దీంతో కాశయ్య చనిపోయాడని అతడి బంధువులకు తెలిపారు. దీంతో కాశయ్య సోదరుడు పులి సురేష్ మృత దేహాన్ని చూసి అనుమానం కలిగి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజం బయట పడింది. పోలీసులు నాగలక్ష్మి, సైదులు అరెస్ట్ చేసి రిమాండుకు తరిలించి వారి నుంచి సెల్ ఫోన్, ఒక మందు బాటిల్, ఒక త్రాడు స్వాధీనం చేసుకున్నారు.

 

Wife Murder Husband with Lover in LB Nagar