Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాను: మంచు లక్ష్మి

manchu

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. విజయ్ యెలకంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను మోహన్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ “ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు విజయ్‌కు ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “నాకు థ్రిల్లర్ జోనరంటే ఎంతో ఇష్టం. విజయ్‌కి ఇది తొలి సినిమాలా లేదు. నేను సినిమాలోని కొన్ని సీన్స్ కూడా చూశాను. అవన్నీ చాలా బావున్నాయి”అని చెప్పారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ “నేను నటిగా ఈ స్టేజ్‌లో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నే. క్రమశిక్షణ అనే పునాదులపై పెరిగాం మేం. దర్శకుడు విజయ్ లేకపోతే ఈ సినిమాయే లేదు. రెండు, మూడు కథలు అనుకున్నాం. చివరికి ఈ కథను ఓకే చేశాం. దర్శకుడు ఏనాడు బడ్జెట్ ఒక్క రూపాయి పెంచమని అడగలేదు. ఇక మోహన్‌బాబు కూతురిగా కాకుండా నా సొంత ప్రతిభతోనే ఎదిగే ప్రయత్నం చేస్తున్నా. ఈ సినిమా ప్రతిక్షణం థ్రిల్ చేస్తుందనే గ్యారెంటీ ఇస్తున్నాను. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల రాబోతోంది”అని అన్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మాట్లాడుతూ “ఇంగ్లీష్ నాటకాలు వేస్తూ దర్శకత్వం వహిస్తూ వచ్చాను. పదేళ్లుగా నాకు మంచు లక్ష్మి తెలుసు. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మికి చాలా థాంక్స్‌”అని తెలిపారు. హీరో సమ్రాట్ మాట్లాడుతూ “విజయ్ విజన్ అద్భుతంగా ఉంది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను”అని పేర్కొన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ “మంచు లక్ష్మిని గతంలో ఒకటి రెండుసార్లు మాత్రమే కలిశాను. నన్ను నమ్మి ఓ ఫ్రెండ్‌లా అన్ని విషయాల్లో నాకు సహాయం చేశారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ కృష్ణ, స్వప్నదత్, శిల్పా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments