Home తాజా వార్తలు భార్య, పిల్లల్ని చంపిన వ్యక్తి ఆత్మహత్య..!

భార్య, పిల్లల్ని చంపిన వ్యక్తి ఆత్మహత్య..!

Wife, suicide who killed children
బాలాపూర్‌: ఫిబ్రవరి 5న మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ, సుమిత్రా ఎన్‌క్లేవ్‌లో భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన హరీందర్‌గౌడ్ (35) అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన హరీందర్‌గౌడ్ ఫిబ్రవరిలో జిల్లెలగూడ, సుమిత్రా ఎన్‌క్లేవ్ రోడ్డు నెంబర్ 2లో తన ఇంట్లో భార్య, పిల్లల్ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం జైలు నుంచి విడుదలైన ఆయన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో తన తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం తన తండ్రి నారాయణగౌడ్‌తో సుమిత్రా ఎన్‌క్లేవ్‌కు వచ్చిన హరీందర్‌గౌడ్, తన తండ్రితో కలిసి ఇంటిని శుభ్రం చేసుకున్నారు. తండ్రి మరుసటి రోజు స్వగ్రామానికి వెళ్లి పోయారు. మంగళవారం రోజు హరీందర్‌గౌడ్‌కు తండ్రి ఫోన్ చేయగా సమాదానం రాలేదు. తండ్రి నారాయణగౌడ్ తన మరో కుమారుడైన హస్తినాపురంలో ఉండే సత్యనారాయణకు ఫోన్ చేసి అన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, వెళ్లి చూడాలని చెప్పడంతో హరీందర్‌గౌడ్ తమ్ముడు బుధవారం 10 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి హరీందర్‌గౌడ్ చనిపోయి బెడ్‌పై ఉన్నాడు. మృతుని తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. హరీందర్‌గౌడ్ చాకుతో మెడ కోసుకున్నట్టు తెలుస్తుంది. సంఘటన స్థలానికి వనస్థలిపురం ఎసిపి గాంధీనారాయణ, మీర్‌పేట్ ఎస్.ఐ.లు రాఘవేందర్, మైబేల్లిలు వచ్చి పరిశీలించారు. మృతి తమ్ముడు  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.