Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఉద్యోగం కోసం భర్తను చంపించిన భార్య…

Wife who killed her husband for the job
హైదరాబాద్: తనను కాదని మరోక పెళ్లి చేసుకున్న భర్తను గతంలో తన కారు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితో మర్డర్ చేయించిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడ గ్రామంలోని భవానినగర్‌కు చెందిన కేస్యా నాయక్ (43) పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. 20సంవత్సరాల క్రితం కేస్యా నాయక్ కు కేతావత్ పద్మతో వివాహం జరిగింది. అనంతరం వారి మద్య మనస్పర్దలు రావడంతో కోర్టులో కేసు నడుస్తుండగానే కేస్యానాయక్ శైలజ తో రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాప ఈ విషయం  తెలుసుకున్న మొదటి భార్య పద్మ నన్ను కాదని రెండవ వివాహం చేసుకున్న కేస్యానాయక్‌ను ఎలాగైన చంపాలనీ నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే కేస్యానాయక్ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసిన సబావత్ వినోద్‌తో పద్మ తన భర్తను చంపితే, అతను చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బుల నుండి రూ.10లక్షలు ఇస్తానని చెప్పిగా దానికి వినోద్ అంగికరించాగా అడ్వాన్స్‌గా పద్మ వినోద్‌కు 15వేల రూపాయాలను ఇచ్చి మిగిలిన డబ్బులు పని అయిన తర్వాత ఇస్తానని చెప్పింది. పథకం ప్రకారం సెప్టెంబర్ 1న రాత్రి 8:00 గంటలకు కేస్యానాయక్ డ్యూటి ముగించుకుని ఇంటికి వస్తుండగా సబావత్ వినోద్ అతనికి ఫోన్ చేయాగా ఎల్ బి నగర్‌లో కలుసుకున్నారు.

అక్కడ నుండి జైలో వావానం(టిఎస్ 07 యుఇ2221)లో గుర్రంగూడ దగ్గర ఉన్న భవాని బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యానాయక్‌కు మోతాదుకు మించి మద్యం తాగిపించాడు. ఆ తర్వాత కేస్యానాయక్‌ను అదే వాహనంలో వినోద్ ఎక్కించుకుని డ్రైవర్ పక్క సిట్లో కూర్చోబెట్టాడు. కారును గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు కొద్దిగా ముందుకు వెళ్లగానే కేస్యానాయక్ బాగా మద్యం మత్తులో ఉన్నాడని గమనించిన వినోద్ కారును పక్కకు ఆపి వెనుక డోర్లకు లాక్‌లు వేసి వెనుక సిట్లోకి వెళ్లి ముందు సిట్లో కుర్చున్న కేస్యానాయక్‌ను గొంతును తన చేతులతో గట్టిగా నులిమి చంపివేశాడు. కాగ ఎవరికి అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం జరిగినట్టు సృష్టించాలని భావించిన వినోద్ అక్కడ నుండి ఇంజాపూర్ కమాన్ దగ్గర గల హైటెన్ష విద్యుత్ స్తంబానికి కారును ఎడవవైపు ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగ అక్కడే ఉన్న వినోద్, పద్మలపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మర్డర్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు పంపించి వారిని పోలీసులు విచారిస్తున్నారు. చాలా చాకచక్యంగా కేసును చేదించినందుకు వనస్థలిపురం సిఐ పి.నరేందర్, ఎస్ఐ సుధాకర్‌రావు మరియు సిబ్బందిని ఎసిపి గాంధీనారాయణ అభినందించాడు.

Comments

comments