Home రాష్ట్ర వార్తలు అరణ్య రోదన

అరణ్య రోదన

spఉన్నత స్థాయి బృందం స్వయంగా వెళ్లి మొర పెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నకేంద్రం వైఖరిపై మండిపడ్డ రాష్ట్ర మంత్రులు,టీం ఇండియా అంటే ఇదేనా అని సూటి   ప్రశ్న
కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మరిచిందని ధ్వజమెత్తిన డిప్యూటీ సిఎంలు మహమూద్ అలీ, కడియం, ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపి జితేందర్‌రెడ్డి

న్యూఢిల్లీ: ఇద్దరు డి ప్యూటీ సిఎంలు, ఇద్దరు మంత్రులు, ప దకొండు మంది ఎంపిలు, ఇద్దరు ప్రత్యే క ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర సర్కా రు హైలెవల్ డెలిగేషన్ బృందం మోడీ సర్కారుపై విరుచుకుపడింది. కేంద్రం లో సమాఖ్య స్పూర్తి లోపించిందని ఆరో పించింది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదని ప్రశ్నిం చింది. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సహా పలువురు కేంద్రమంత్రులను పదే పదే కలిసి విజ్ఞప్తి చేసినా విభజన చట్టం ద్వారా తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధు లు ఎందుకు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రతిపాదనలు న్యాయబద్ధం కాకపోతే బహిరంగంగానే ప్రకటించాలని సవాల్ విసిరింది. ప్రధాని చెప్పేటీం ఇండియా స్పూర్తి ఇదేనా అని ప్రశ్నించింది. కేంద్రంలోని పెద్దల చుట్టు పదే పదే తిరిగికి కాకా పడితే తప్ప ఫైళ్లు కదపమనేభావన ఢిల్లీ పెద్దలకు ఉన్నట్లుందని ఆరోపించింది. కేంద్రంతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తాము, అభివృద్ధి కోసం కేంద్రంతో వైరం పెట్టుకోవద్దనే ఆలోచనతో అణ కువగా వ్యవహరిస్తున్నామని టిఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ జితేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సర్కారు సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చ రించారు. కేంద్రం సాయం చేయకున్నా సిఎం కెసిఆర్ ఏ పని ఆపలేదన్నారు. గురువారం నాడు ఢిల్లీలోని ఎపి భవన్‌లో విలేకరులతో ఎంపి జితేం దర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై విభ జన చట్టంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోక పోగా… యుపిఎ సర్కారు ప్రకటించిన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని కూడా కేంద్రం రద్దు చేసిందని కడియం శ్రీహరి ఆరోపించారు. ‘అమ్మపెట్టదు అడుకో నివ్వదు’ అన్న చందంగా కేంద్రం వ్యవ హరిస్తోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సి.ఎస్.టి స్థానంలో వస్తున్న జి.ఎస్.టి అమలు అయ్యేలోగా సి.ఎస్.టి ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.7 వేల కోట్ల పై చిలుకు బకాయిలను చెల్లించాలని డజను సార్లు జైట్లీకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా గుర్తించబడి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి రుణం పొందే హక్కును దక్కించుకున్నా.. జైట్లీ అప్పు పొందేందుకు అవస రమైన తెలంగాణ ఎఫ్.ఆర్.బి.ఎంను 0.5 శాతా నికి పెంచడం లేదని ఈటెల మండిపడ్డారు. చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకుండా, అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించకుండా జైట్లీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిష్టాత్మకమైన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులను కొనసాగిస్తున్నా మని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో వండిన అన్నమే పెడుతున్న నేప థ్యంలో ఉదారంగా వ్యవహరించాలని కేంద్ర పౌర సరఫరాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను పదే పదే విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు తెలంగాణకు బియ్యం కోటా పెంచలేదని మండిపడ్డారు. మాకు రొట్టెలు తినే అలవాటు లేదు కాబట్టి కేంద్రం ఇస్తున్న 8,200 మెట్రిక్ టన్నుల గోధు మల కోటా తగ్గించి సన్న బియ్యం కోటా పెంచా లని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎస్‌సి రిజర్వేషన్ చేస్తామని వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఇప్పుడు కాదం టోందని ఆరోపించారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో వరంగల్ ఉపఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు.  కేంద్రంపై నిరసన గళం వినిపిస్తూనే పలు పెం డింగ్ ప్రాజెక్టులను కేంద్రమంత్రుల దృష్టికి టిఆర్ ఎస్ బృందం తీసుకెళ్లింది. బుధవారం నలుగురు కేంద్ర మంత్రులను కలిసిన బృందం, గురువారం మరో నలుగురు కేంద్ర మంత్రులను కలిసి మెమొరాండం సమర్పించింది.
కేంద్ర ఆర్థిక, రక్షణ, రైల్వే మంత్రులను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన మెమొ రాండం మరోసారి ఇచ్చింది. అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయింది. రాష్ట్ర సర్కారు హార్టికల్చర్ రంగానికి ఇస్తున్న ఆకర్షనీయమైన రాయితీల కారణగా పెద్ద సంఖ్యలో రైతులు ఈ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. పూలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోతోంది తెలిపింది. డిమాం డ్‌కు సరిపడేలా వరంగల్‌లో మిర్చి, నిజామాబా ద్‌లో పసుపు, గుడిమల్కాపూర్‌లో పూలు, గొట్టిమా మిడిలో కూరగాయల కోల్డ్ స్టోరేజీలుఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడ్‌గల్ వద్ద నలభై రెండు ఎక రాలను భూమి సిద్ధంగా ఉందని పేర్కొంది. స్పైస్ బోర్డుతో కుదిరిన ఒప్పందం మేరకు ఇక్కడ వెంట నే స్పైస్ పార్క్ ఏర్పాటు చేయాలి విజ్ఞప్తి చేసింది.