Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఐఫోన్ 8 వచ్చే ఏడాదేనా?

iphone-8

ముంబయి: ఐఫోన్ 8 ఎప్పుడొస్తుందా అని ఎదు రుచూస్తున్న వారికి నిరాశ మిగలనుంది. ఈ ఫోన్ కోసం కొంత కాలం ఆగాల్సిందేనని తెలుస్తోంది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఐఫోన్ అమ్మ కాలు మందగించడం, ఫోన్ల తయారీ సంస్థలతో యాపిల్‌కు ఉన్న వివాదాలు ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1తో ము గిసిన త్రైమాసికంలో సంస్థ 50.76 మిలియన్ల ఐఫోన్లు విక్రయించింది. దీనికి ముందు త్రైమా సికంలో 51.19 మిలియన్ల ఫోన్ల సేల్స్‌తో ఈసారి తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు మార్కెట్‌లో యాపిల్ షేర్ విలువ 1శాతం పడిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐఫోన్ 8ను ఇప్పట్లో విడు దల చేయకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఐఫోన్లను తయారు చేసి ఇచ్చే సంస్థలు కూడా ఆలస్యం చేస్తున్నాయని డచ్ బ్యాం క్ నివేదిక పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి యా పిల్ సంస్థ అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా రానున్న ఐఫోన్ 8పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లకంటే భిన్నమైన లుక్, ఒఎల్‌ఇడి స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఫోన్ రానుంది. ఈ ఏడాది సెప్టెం బర్‌లో ఐఫోన్ 8 మార్కెట్‌లోకి వస్తుందని అంతా భావించారు. ఈ ఫోన్ కోసం వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందేనని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

Comments

comments