Search
Friday 16 November 2018
  • :
  • :

నాకు నచ్చితేనే చేస్తా: కోహ్లీ

Virat-Kohli

న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్ ఎదైనా చెలరేగిపోతున్నాడు కోహ్లీ. క్రికెట్‌లో కోహ్లీ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో విరాట్‌కు అభిమానుల ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వివిధ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను ప్రచారం చేసుకోవడానికి కోహ్లీని అంబాసిడర్‌గా ఎంచుకుంటున్నాయి. అయితే కోహ్లీ మాత్రం… తాను వాడే, తనకు నచ్చిన వాటికి మాత్రమే అంబాసిడర్‌గా ఉంటానని చెబుతున్నాడు.

ఇక ఈ ఏడాది జూన్‌లో పెప్సీ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకున్న కోహ్లి దాన్ని ఉద్దేశిస్తూ… ‘కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను. నేను వాడని, నాకు నమ్మకం లేని వాటికి అంబాసిడర్ గా చేయలేను’అని వ్యాఖ్యానించాడు. ప్రధానంగా ఫిట్ నెస్‌ను కాపాడుకునే క్రమంలో సాఫ్ట్ డ్రింక్స్ కు కోహ్లి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ క్రమంలోనే పెప్పీతో తనకున్న ఆరేళ్ల బంధానికి కోహ్లి స్వస్తి చెప్పాడు. ప్రస్తుతం కోహ్లి 17 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.

Comments

comments