Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సినిమాలకు సమంత గుడ్‌బై..?

Will Samantha say goodbye to Movies?

హైదరాబాద్: దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి, అక్కినేనివారి కోడలు సమంత సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అయితే, కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సినిమాలు చేయటం ఇప్పట్లో మానేది లేదని స్వయంగా సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే ఏడాది చుల్‌బులీ సినిమాలకు గుడబై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్ని 2019 మార్చి వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలని ఆమె భావిస్తుందట. దీంతో ఇప్పుడు సామ్ నిజంగానే సినిమాలకు దూరం కానుందా అనే చర్చ జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల కోసమే సమంత ఈ నిర్ణయం తీసుకుందనుకుంటే… అప్పట్లో తాము పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని చెప్పిన విషయం తెలిసిందే. అంతేగాక పిల్లల్ని కనేందుకు తాము ఓ టైమ్ అనుకున్నామని, ఆ సమయం వచ్చేదాకా కెరీర్ గురించి తప్పిస్తే వేరే ఆలోచనలు లేవని సామ్ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు సమంత ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో పాటు భర్త చైతూ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించే మూవీలో కూడా నటించనుంది. అలాగే యూ టర్న్ అనే రీమేక్ మూవీ కూడా సామ్ నటించనుంది. ఇలాంటి సమయంలో సమంత సినమాలకు దూరం కానుందనేది ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.

Comments

comments