Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆ యంగ్ హీరోకు ఓకే చెప్పనున్న సమంత?

telugu star heroine samantha

ఏమాయా చేసావే మూవీ తో తెలుగు సినిమా కు పరిచయమైన సుందరి సమంత…. తెలుగు ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత నాగ చైతన్యతో ప్రేమ వ్యవహారం నడిపించింది. మొత్తానికి వాళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా అయింది.

అయితే, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లో నటించిన సమంత.. ఆ తర్వాత ఒక్కమూవీకి కూడా సైన్ చేయలేదు. అయితే.. నాగ చైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలడమే ఏ మూవీని ఒప్పుకోకపోవడానికి కారణమని సినీ ఇండస్ట్రీ కోడై కూస్తున్నది.

అయితే.. తర్వాత ఓ తెలుగు సినిమాకు, రెండు తమిళ్ సినిమాలకు మాత్రం సమంత సైన్ చేసిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ తెలుగు సినిమా కూడా తన మామ నాగార్జున నటిస్తున్న రాజు గారి గది 2 సినిమా అట. ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తయిందట.

ఇక, కోలీవుడ్ లో యంగ్ హీరో జీవీ ప్రకాశ్ సరసన నటించడానికి ఒప్పుకోనుందట సమంత. తెలుగు లో వచ్చిన నిఖిల్ సిినిమా ఎక్కడకు పోతావు చిన్నవాడా మూవీ ని తమిళ్ లో జీవీప్రకాశ్ తో తీస్తున్నారట. ఆ మూవీలో ఒక హీరోయిన్ గా హన్సికను తీసుకుంటుండగా.. మరో హీరోయిన్ కోసం సమంతను సంప్రదించారట.

అయితే.. ఒకవైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూ… మరో వైపు చేతి నిండా సినిమా ఆఫర్లు వస్తుండటంతో జీవీ ప్రకాశ్ మూవీకి ఓకే చెబుతుందా లేదా అని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట.

Comments

comments