Home తాజా వార్తలు ఉప్పల్ టెస్టు: విండీస్ బ్యాటింగ్

ఉప్పల్ టెస్టు: విండీస్ బ్యాటింగ్

Windies have won the toss and have opted to bat

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదట టాస్ గెలిచిన విండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చి శార్ధూల్ ఠాకూర్ ను తీసుకుంది. అలాగే ప్రత్యర్థి విండీస్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో చివరి నిమిషంలో మ్యాచ్ కు దూరమైన కెప్టెన్ జాసన్ హోల్డర్, జోమెల్ వారికన్ జట్టులోకి తిరిగి వచ్చారు. కీమో పాల్, షెర్మన్ లివీస్ లను తుది జట్టు నుంచి తప్పించారు. ఇక తొలి టెస్టు  రాజ్‌కోట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచి ఆధిక్యాన్ని అందుకున్న కోహ్లీసేన క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది.  రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Teams:

Windies: Kraigg Brathwaite, Kieran Powell, Shai Hope, Shimron Hetmyer, Sunil Ambris, Roston Chase, Shane Dowrich(w), Jason Holder(c), Devendra Bishoo, Jomel Warrican, Shannon Gabriel

India: (Playing XI): Prithvi Shaw, Lokesh Rahul, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Ravindra Jadeja, Ravichandran Ashwin, Kuldeep Yadav, Umesh Yadav, Shardul Thakur