Home వరంగల్ రూరల్ పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు

పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు

Wine  Selling high prices at Belt Shops

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : గ్రామ గ్రామాన మద్యం అక్రమ దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో వసతులు లేకున్నా వీధికో బెల్టు దుకాణం మాత్రం వెలుస్తోంది. రోజంతా కూలీనాలి చేసుకుంటున్న శ్రమజీవులు సాయంత్రం కాగానే సంపాదించిన సొత్తంతా బెల్టు దుకాణాల్లో పోస్తున్నారు. అయితే ప్రభు త్వం నిర్ణయించిన ధరలకు మ ద్యం విక్రయించకుండా అధిక ధరలకు మద్యం విక్రయాలకు పాల్పడుతూ పేదలు, మధ్యతరగతి వారి జేబులకు చిల్లులు పెడుతు న్నారు. వీరిని అటు టెం డర్లు దక్కించుకున్న మద్యం వ్యాపా రులు, ఇటు ఎక్సైజ్ అధికా రులు పెంచి పోషిస్తుం డడంతో గ్రామాల్లో మద్యం అక్రమ దు కాణాలు పెచ్చుమీరుతున్నాయి. దాడులకు పాల్పడకుండా ఉండేందుకు పోలీసులకు సైతం నెలనెలా ముడు పు లు ముడుతున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి..
గ్రామాల్లో బెల్టు దుకాణాల జోరు
గ్రామీణ ప్రాంతాలతో పాటు మారు మూల ప్రాం తాల్లో సైతం మద్యం ఏరు లై పారుతోంది. మండల కేంద్రాల్లో ఉన్న టెం డర్ దక్కించుకున్న మద్యం దుకాణాలు వాటి అమ్మకాలను గ్రామాలకు విస్తరిం చేందుకు బెల్టు దుకాణాలను పెంచిపోషిస్తున్నాయి. మద్యం దుకాణాల యాజమాన్యాలు సిండి కేట్‌గా మారి బెల్టు దుకాణాలను పంచేసుకున్నారు. మండలంలోని రెండు మద్యం దుకాణాలు 15 గ్రామపంచాయతీలను, 8 అనుబంధ గ్రామాలను సమానంగా పంచేసుకున్నాయి. వీరు విధించుకున్న నిబంధనల ప్రకా రం ఓవైపు వచ్చిన దుకాణాదారులు మరో దుకారణానికి వెళ్ల కూడదు. ఇలా బెల్టు దుకాణాలను పంచుకుని వారికి పెద్ద ఎత్తున మద్యం సరుకును సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సైతం మద్యం దుకాణాలు ఉన్నట్లే కనిపిస్తోంది. బెల్టు దుకాణాల్లో భారీగా నిల్వలు ఉంటుండడం, రెస్టారెం ట్లను తలపిస్తూ జోరుమీద విక్రయాలు సాగిస్తు న్నాయి. గ్రామాల్లో ఏ దుకాణం సరిగా నడువ కున్నా రాత్రి 11గంటల వరకు బెల్టు దుకాణాలు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నాయి.
అధిక ధరలకు విక్రయాలు
అటు ఎక్సైజ్ శాఖ, ఇటు మద్యం దుకాణాల వ్యాపారులు కలిసి బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తుండడంతో ఇక వారు అడ్డూ అదుపు లేకుండా జనం వద్ద నుంచి ఎమ్మార్పీ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మందు బాబులు బెల్టు దుకాణాలకు వస్తే వారి ముక్కుపిండి ప్రభుత్వం విధించిన ధరల కంటే సుమారు రూ. 20 నుంచి రూ. 30 అధికంగా వ సూలు చేస్తున్నారు. ఇక అధిక ధరలు కలిగిన మద్యం బాటిళ్లకు మరింత ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో బాటిళ్‌పై రూ. 20 అదనంగా అక్రమంగా వసూలు చేస్తున్నారు.
ఎవరి వాటా వారికే
మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎవరి వాటాలను వారికి ముట్టజెప్పుతున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు సజావుగా జరగాలంటే, వారిపై దాడులు నిర్వహించకుండా ఉండేందుకు దాడులు చేసే ఆయా శాఖలకు డబ్బులు ఎర చూపుతున్నారు. ఎలాంటి చర్యులు తీసుకోకుండా ఉండేందుకు నెల నెలా రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో ఉన్న రెండు దుకాణాలు కలిసి ఈ మొత్తాన్ని పోలీసు అధికారులకు ప్రతీ నెలా ఠంచన్‌గా అందిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధం లేని పోలీసు అధికారులకే ఇంత పెద్ద మొత్తంలో నెలనెలా డబ్బులు ముడుతున్నాయంటే ఇక సంబంధం ఉన్న ఎక్సైజ్ శాఖకు ఇంకెంత పెద్ద మొత్తంలో ముడుపులు ముడుతున్నాయో ఊహించుకోవచ్చు. ముడుపులు తీసుకుంటున్నారు కాబట్టే ఈ మధ్య బెల్టు దుకాణాలపై దాడులు మానేశారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు
ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మద్యం దుకాణాల నిర్వహణ చూసుకోవాల్సిన సంబంధిత ఎక్సైజ్ శాఖాధికారులు దాన్ని తుం గలో తొక్కి మద్యం వ్యాపారుల కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు ఎక్సైజ్ అధికారులు ఊతం ఇవ్వడంతో మద్యం వ్యాపారులు గ్రామాల్లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న బెల్టు దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యం సరుకులను సరఫరా చేస్తూ మీ ఇష్టం వచ్చినట్లు అమ్ముకొమ్మని, ఎవరికి భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతున్నారు. ఎలాగూ తాము అటు పోలీసులకు, ఇటు ఎక్సైజ్ అధికారులను చూసుకుంటున్నామని, ఇక ఎవరికీ జంకకుండా గ్రామా ల్లో మద్యం ఏరులై పారే విధంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు పుట్టుకొస్తున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని బెల్టు దుకాణాల ఆగడాలను ని లువ ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు దా డులు నిర్వహించి కేసులు నమోదు చేస్తే తప్ప దుకాణాలు తగ్గుముఖం పట్టవని మం డల ప్రజలు కోరుతున్నారు.