Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మద్యం షాపుల వేలానికి రంగం సిద్ధం!

రేపు నోటిఫికేషన్ – 21వరకు టెండర్లకు గడువు
23న లాటరీ ద్వారా లైసెన్సుల ఖరారు
ఉరుకులు-పరుగుల్లో వ్యాపారులు

12543సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఖరారు చేయడంతో జిల్లాలో వైన్ షాపుల వేలానికి రంగం సిద్ధమైంది. ఫలితంగా జిల్లాలోని మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. సమ యం కూడా చాలా తక్కువగా ఉండడంతో వ్యాపారులు, వారి అనుంగు సహచరులు, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకునే వారు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇక గతంలో వ్యాపారంలో ఉండి షాపులు మిస్సయిన వారు కసితో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మద్యం వ్యాపారంతో ముడిపడి రాజకీ యాలు కొనసాగుతుండడంతో ఈ షాపులకు డిమాండ్ ఏర్పడింది. ఇక కర్ణాటక, మహా రాష్ట్రతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా జిల్లాలోని మద్యం వ్యాపారంపై ఆసక్తితో ఉన్నారు. పాత సిండికేట్లు, కొత్తగా రూపొందుతొన్న గ్రూపులు కూడా టెండర్ల దాఖలుకు సిద్ధమవుతున్నాయి. కొత్త పాలసీకి సంబంధిం చి అనేక ఊహాగానాలు, ప్రచారాలు జరిగిన నేపథ్యంలో తిరిగి పాత పాలసీనే ప్రభుత్వం ఖరారు చేసిం ది. ఈ కారణంగా జిల్లాలోని రెండు ఎక్సైజ్ సూపరిండెం టెంట్ డివిజన్ల పరిధిలో మొత్తం 178 వైన్ షాపులు ఉన్నా యి. గతంలో కూడా ఇంతే మొత్తంలో షాపులున్నాయి.

వీటి గడువు ఈనెలాఖరుతో పూర్తి కాబోతోంది. కొత్త పాలసీ ఖరారు కావడంతో తిరిగి ఈ షాపులకు వేలం వేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు వస్తాయి. గతంలో పటాన్‌చెరు పరిధిలోని 16 షాపులకు టెండర్లు దాఖలు కానే కాలేదు. అనేక సార్లు టెండర్లు పిలిచినా ఒక్క రు కూడా టెండర్లు వేయలేదు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఈ దుకాణాలు ఉన్నాయి. దీంతో వీటి లైసెన్సు ఫీజులను రూ.90లక్షలుగా నిర్ణయించారు. ఫలితంగా ఇంత మొ త్తానికి టెండర్ వేయలేమని భావించి ఒక్క వ్యాపారి కూడా రాలేదు. ఈ సారి కొత్త పాలసీలో కూడా ఈ షాపులకు టెండర్లు దాఖలు కావడం కష్టమే. ఎందు కంటే ఈ సారి లైసెన్సు ఫీజులను మరో 20 శాతం పెంచారు. అంటే పటాన్‌చెరు, ఆర్‌సిపురం పరిధిలోని షాపులకు ఒక కోటి ఎనిమిది లక్షలకు ఫీజు పెరిగింది. 90 లక్షలు ఉన్నప్పుడే ఒక్కరు కూడా టెండర్ వేయకపోవడంతో…దానికి మించి పెంచితే ఇక ఎవరు వస్తారని ఒక ఎక్సైజ్ అధికారి వ్యాఖ్యా నించారు. కాకుంటే గతంలో లైసెన్సు గడువు ఒక సంవత్స రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రెండు సంవ త్సరాలకు పెంచారు. ఇది వైన్ షాపుల వారికి కొంత వెసులుబాటుగా ఉంది.
10 వేల జనాభా ఉన్న ప్రాంతానికి కొత్త పాలసీలో రూ.78 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.81.06 లక్షలు, 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి కోటి 80 వేలు లైసెన్సు ఫీజుగా ఉంది. ఇక ప్రభుత్వ పాలసీ ప్రకారం సోమవారం జిల్లాలో మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి అ వుతుంది. జిల్లాలోని మెదక్, సంగారెడ్డి ఇఎస్‌ల పరిధిలోని షాపులన్నింటికి కూడా సంగారెడ్డిలోని ఇఎస్ కార్యాలయంలోనే దరఖాస్తులు అంటే టెండర్లు స్వీకరిస్తారు.
ఈ నెల 21 వరకు టెండర్ల స్వీకరణ ఉంటుంది. 22న టెండర్ల పరిశీలన జరుగుతుంది. ఆ మరుసటి రోజే లాటరీ నిర్వహించి టెండర్లను ఖరారు చేస్తారు. 23న వైన్ షాపులు దక్కిన వారికి తాత్కాలిక పద్ధతిలో లైసెన్సులు జారీ చేస్తారని, ఆ తర్వాత ఈనెల 28న అధికారిక లైసెన్సులు ఇస్తారని తెలుస్తోంది. ప్రతి మండలంలో షాపులు ఉంటున్న కారణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం లైసెన్సు ల హడావిడి మొదలైంది.

Comments

comments