Search
Wednesday 14 November 2018
  • :
  • :

హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా -2018 ఏరోస్పేస్ సదస్సు

KTR

హైదరాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్టులో గురువారం వింగ్స్ ఇండియా-2018 ఏరోస్పేస్ సదస్సు జరిగింది. ఈ సదస్సును తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఎస్‌ఐపాస్‌తో పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు తాము అనుమతులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏవియేషన్ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. పలు ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ సదస్సుకు జపాన్, యుకె, రాష్యా, అమెరికా, సింగపూర్ సహా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ సదస్సు ఈనెల 11 వరకు జరగనుంది.

Wings India -2018 Aerospace Conference in Hyderabad

Comments

comments