Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

6.3 శాతం పెరిగిన విప్రో నికర అమ్మకాలు

Wiproబెంగళూరు: క్యూ2 ఫలితాల్లో దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ విప్రో లాభం 7.2 శాతం పెరిగింది. గత సంవత్సరం లాభం రూ.2,084.8 కోట్ల నుంచి రూ.2,235.4 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు 6.3 శాతం పెరిగాయి. రూ.11,816 కోట్ల నుంచి రూ.12,566.8 కోట్లకు నికర అమ్మకాలు పెరిగాయని సంస్థ ప్రకటించింది. గత త్రైమాసికంతో పోలిస్తే డాలర్ ప్రకారం, ఐటి సేవల నుంచి రెవెన్యూ 2.1 శాతం పెరిగింది. ఇది 1.82 మిలియన్ డాలర్ల నుంచి 1.85 మిలియన్ డాలర్లకు పెరి గింది. అక్టోబర్- డిసెంబర్ 2015 త్రైమాసికానికి విప్రో ఐటి సేవల అంచనా ఆదాయం 1,841  మిలియన్ డాలర్ల నుంచి 1,878 మిలియన్ డాలర్లకు పెంచారు. fఇటీవల టిసిఎల్, ఇన్ఫోసిస్ వంటి ఐటి దిగ్గజాలు కూడా త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. వీటిలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో త్రై మాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అధిగ మించాయి. సెప్టెంబర్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో కం పెనీ రూ.3,398 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్ ముగింపు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 8.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ 8.9 శాతం పెరిగి రూ.15,635 కోట్లకు చేరుకుంది. మరోవైపు కంపెనీ సిఎఫ్‌ఒ రాజీనామా చేశారు.

Comments

comments