Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నూతన సంవత్సర వేడుకలు

Happy-New-year

నర్సంపేట: గడిచిన సంవత్సరానికి ఘన వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి శుభ స్వాగతం పలికేందుకు డివిజన్ ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. పట్టణంలోని విజ్‌డమ్ స్కూల్‌లో జరిగిన న్యూఇయర్ సంబరాల్లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటుచేసిన సమావేశంలో పెద్ది మాట్లాడారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణి చేశారు. నగరపంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచంద్రయ్య, కౌన్సిలర్‌లు నాయిని నర్సయ్య, గుంటి కిషన్, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, బండి ప్రవీన్, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి,దార్ల రమాదేవి, కామగోని శ్రీనివాస్, పుట్టపాక కుమారస్వామి, వేముల సాంబయ్యగౌడ్ తదితరులున్నారు.

పట్టణంలోని మాంటీస్సోరి పాఠశాలలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నర్సంపేట ఎస్సై హరికృష్ణ పాల్గొని విద్యార్థులతో కలసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎర్ర జగన్మోహన్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్‌లు ఊర్మిళ, ఎర్ర వెంకటరమణారెడ్డి, ప్రిన్సిపాల్ ఆకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. అదేవిధంగా పట్టణంలోని కాకతీయ గ్రాడ్యుయేట్స్ జూనియర్ కళాశాలలో న్యూఇయర్ కేక్ కట్ చేసి పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు. ఆచార్య డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీజుల సాగర్, నంధ్యాల కృష్ణారెడ్డి, శ్రీరాం ఈశ్వరయ్య, డైరెక్టర్‌లు రాంచందర్, రవీందర్‌సింగ్, పిట్టల సురేందర్ తదితరులున్నారు. కేఎస్సార్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినీల సమక్షంలో కళాశాల చైర్మన్ నరహరి రాజేందర్‌రెడ్డి కేక్ కట్ చేసి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నరహరి స్వాతి, ప్రిన్సిపాల్ రవీందర్, అధ్యాపకులు తదితరులున్నారు. పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖ కార్యాలయంలో సిబ్బందితో కలసి మేనేజర్ కేవి.రావు సంబరాలు జరిపారు.

ఖానాపురం మండలంలోని అయినపల్లి రుద్రమాదేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం శివారు కాకతీయ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కమలాకర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.

Comments

comments