Search
Wednesday 21 November 2018
  • :
  • :

పత్తిపాక రిజర్వాయర్‌తో పెద్దపల్లిని ఆదుకుంటాం

cong2*జిల్లా రైతాంగం పొట్టగొట్టి మంత్రుల
నీటి చౌర్యం
*ఎస్‌ఆర్‌ఎస్‌పి చివరి ఆయకట్టుకు
నీరందిస్తాం
*రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీవించండి
*పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మించి ఆ దుకుంటామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇ చ్చాడు. రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాంగా సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశా ల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన  నాలుగు సంవత్సరాల నుంచి జిల్లాలో ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆ యకట్టు కి ంద పంటలు సాగు చేసుకుంటున్న ప్రాంతాల రైతులు క ంట కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ ,పంటల బీమా సైతం కేవలం కొంత మంది రై తులకు మాత్రమే అందించారని విమర్శించారు.పెద్దపల్లి జి ల్లా ప్రజల కష్టాలు తీరాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దీవించి అధికారం కట్ట బెట్టాలని ఆయన విజ్ఙప్తి చేశా డు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా జీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి,ఎంఎల్‌సి షబ్బీర్ అలీ,ఎంఎల్‌ఎలు డికె అరుణ.రేవంత్‌రెడ్డి,,జీవన్‌రెడ్డి,మాజీ మంత్రు లు శ్రీధర్ బాబు, దానం నాగేందర్,ఎంఎల్‌సి సంతోష్ కు మార్,మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్,పెద్దపల్లి మాజీ ఎంఎల్‌ఎ విజయరమణారావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments