Search
Sunday 23 September 2018
  • :
  • :

అప్పుల బాధతో పత్తి రైతు అత్మహత్య

Cotton-farmer-sucide

కరీంనగర్: అప్పు చేసి పత్తి, మక్క చేను పంటలు వేస్తే కాలం కలిసి రాక వేసిన పంటలు ఎండిపోవడంతో రైతు గుండెతట్టులేక శనివారం సాయంత్రం పత్తిరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్నాబాద్ పట్టణ పరిధికి చెందిన ఆరెపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కల్లురి రాజయ్య(47) గత ఐదు సంవత్సరాలుగా తనకు ఉన్న ఐదు ఎకరాలల్లో 4ఎకరాలు పత్తి, ,ఒక ఎకరం మక్క చేను వేశాడు. వర్షాలు లేక పోవడంతో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య గత రెండు, మూడు రోజులుగా దీగాలుగా ఉంటున్న రైతు శనివారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్య మృతితో భార్య ఐల్లవ్వ, కూతురు సుమలత, కూమారులు రమేష్, నరేష్‌లు రోదనలు చూసి కాలనీవాసులు కన్నీటి పర్యంతమైయ్యారు. రైతు కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు నాయకులు డిసిసి అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, కోమటి సత్యనారాయణ, ఎండి హసన్,బొల్లి శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కొరారు.

Comments

comments