Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వేపనూనెతో…

neemప్రస్తుతం బిజీ లైఫ్ గడిపేవారు చాలా మందే ఉంటారు. వారిలో ఒత్తిడి, దూరప్రయాణాలు ఎక్కువ కావడం, వీటితో పాటు కాలుష్యం పెరగడంతో చుండ్రు సమస్య వేధిస్తోంది. అయితే, చుండ్రు నివారణకు ఎన్నో రకాల కంపెనీల షాంపూలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ షాంపూలు వాడితే ఒక్కరోజు చుండ్రు పోయినట్టు పోయి, మళ్లీ రెండవ రోజు సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా చుండ్రు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందిగానీ తగ్గడం లేదు. ఎన్ని ప్యాక్‌లు వేసుకున్నా, షాంపూలు వాడినా పూర్తిగా చుండ్రు సమస్య నుంచి బయటపడడం లేదు. అయితే, చుండ్రు సమస్యకు వేపాకు చకటి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్లమేటరీ గుణాలు వేపాకులో ఎక్కువగా ఉండడం వల్ల, చుండ్రును ఈజీగా రించడమేగాక, స్కిన్ అలర్జీలు, పిగ్మెంటేషన్, చుండ్రు, మాడుపై దురద, పొడిబారిన స్కాల్ఫ్, పింపుల్స్, యాక్నే సమస్యలను మాటు మాయ మవుతాయి. వేపాకుతో చుండ్రు నివారించే మార్గాలు చూద్దాం.
వేపాకుతో మంచి ఫలితం చుండ్రు నివారించడానికి వేపాకు పేస్ట్ సరైనది అని చెప్పవచ్చు. వేపాకులకు నీళ్ళు, తేనె కలుపుతూ పేస్ట్ చేసి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. కాసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత కడిగేస్తే… మంచి ఫలితం కనపడుతుంది.
వేప నీళ్ళతో మటుమాయం వేప నీళ్లను బాగా కాగాబెట్టి, దానిలో 40 వేపాకులు కలపాలి. నీటిలో రాత్రంతా అలానే నానబెట్టాలి. ఈ వేప నీటితో ఉదయాన్నే తలను శుభ్రం చేసుకోవడం వల్ల తలలో చుండ్రు ద్వారా వచ్చిన దురద తగ్గిపోతుంది.
వేప నూనె చక్కటి పరిష్కారం వేప నూనె చుండ్రు నివారించడానికి చక్కటి పరిష్కారం. కొబ్బరినూనె, వేపనూనెను సమాన భాగంలో తీసుకుని మిక్స్ చేయాలి. ఈ ఆయిల్‌ని మాడుకు రాసుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు తగ్గిపోతుంది.

Comments

comments